ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కరోజులోనే ఎంతోమంది సాధారణ ప్రజలు సెలబ్రిటీలు గా మారిపోతున్నారు.. ఇక లోకులు కాకులు ఆంటీ అనే మహిళ సినిమా థియేటర్ ముందు రివ్యూ చెప్పడం ద్వారా సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిన సంగతి తెలిసిందే. ఓవర్ నైట్ స్టార్ గా లోకులు కాకులు ఆంటీ మారిన తరవాత అలానే చాలా మంది థియేటర్ ల వద్ద రివ్యూ లు చెబుతూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అభిమాని కూడా ఒకరు సినిమా థియేటర్ వద్ద రివ్యూ చెబుతూ ఎంతో పాపులర్ అయ్యారు. సినిమా ఎలా ఉంది అంటూ ప్రశ్నించడం తో....అఖిల్ అయ్యగారే కరెక్ట్...ఆయనే రావాలి..ఆ అయ్యగారే రావాలి అంటూ మైక్ ముందు అరిచారు. ఇక దానికి సంబందించిన వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయ్యింది.
అయితే తాజాగా ఆ వీడియో పై అఖిల్ కూడా స్పందించారు. అయ్యగారు అనే మీమ్..చాలా పాపులర్ అయ్యింది. మీకు తెలిసే ఉంటుంది. అందులో ఆయన నాకంటే ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయన్ని ఒక్కసారి అయినా కలవాలి..అతని వీడియోలు అన్నీ నేను చూసాను చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. నా అభిమాని ఎంతో పాపులర్ అవ్వడం సంతోషంగా ఉంది. ఆ వీడియో తరవాత నా పై పాజిటివ్ ట్రోల్స్ వచ్చాయి. నిన్ను కలవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను బ్రదర్...జాగ్రత్తగా ఉండు సపోర్ట్ చేస్తూ ఉండు.."అంటూ అఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించారు. ఇక అఖిల్ చేసిన కామెంట్ తర్వాత అయ్యగారు చాలా లక్కీ అని ఒక యంగ్ హీరో అతన్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాడని నెట్టింట కామెంట్లు వస్తున్నాయి. మరి అయ్యగారి అభిమాని అఖిల్ ను కాలుస్తారో లేదో చూడాలి.