ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ లోని టాప్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాల వెంటే పడుతూ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ రెబల్ స్టార్ ప్రభాస్ తోనే మొదలయ్యిందని చెప్పాలి. అయితే పాన్ సినిమాలో కేవలం ఒక ఇండస్ట్రీ నుండి నటీనటులను తీసుకోవడం వల్ల లాభం ఉండదు.... సినిమా అన్ని భాషల్లో ప్రేక్షకులను అలరించాలి కాబట్టి దాదాపు అన్ని భాషల నుండి నటీనటులు తీసుకోవడం వల్ల సినిమా విజయానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పాన్ ఇండియా సినిమాలో కూడా ఒక్కో ఇండస్ట్రీ నుంచి కొంతమంది నటీనటులను తీసుకోవాల్సి వస్తోంది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న అది పురుష్ సినిమా లో బాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి తో పాటు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా గా ప్రభాస్ తో నాగ్ అశ్విన్ ఒక సినిమా చేస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే అంతేకాకుండా కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్టు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో ఓ మలయాళ నటుడు నటించబోతున్నట్లు జోరుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అతను ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియం సినిమాలో హీరోగా నటించిన పృథ్వీరాజ్.
ఈ సినిమాతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పృధ్వీరాజ్ సలార్ సినిమాలో నటించబోతున్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ కు మలయాళ హీరో పృథ్వీరాజ్ తో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ పృథ్వీరాజ్ ను ఓ కీలక పాత్రలో నటించేందుకు తీసుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ మొదలుపెట్టిన తరవాత పృథ్వీరాజ్ తెలుగు వారికి సైతం పరిచయం అయ్యుడు. దాంతో సలార్ సినిమాకు పృధ్వీరాజ్ క్రేజ్ ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు.