అందరి మనసు దోచేసిన బుట్ట బొమ్మ.. ప్రపంచ రికార్డు?

praveen
సినిమాల్లో ఎంతలా స్టార్ హీరో హీరోయిన్లు ఉన్నప్పటికీ సినిమా స్టోరీని ముందుకు నడిపించేది మాత్రం నేపథ్య సంగీతం అనే విషయం తెలిసిందే. అదే సమయంలో సినిమాలోని పాటలు కూడా సినిమాకు కొత్త ఊపిరి పోస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సినిమాలోని పాటల వల్లే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.  ఇక సినిమా లోని పాటలు సినిమా స్టోరీ కూడా బాగుంటే ఇక అదే సూపర్ డూపర్ హిట్టవుతుంది. ఇక అలాంటి సినిమానే అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురములో సినిమా.  ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులకు నచ్చడమే కాదు ఈ సినిమాలోని ప్రతి పాట శ్రోతలను ఉర్రూతలూగిస్తుంది.

 సాధారణంగా సినిమాల్లో ఏదో ఒక పాట ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ ఉంటుంది  కానీ ఈ సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకుల మదిని తాకింది అని చెప్పాలి. ఎన్నో రోజుల పాటు తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో నానింది. ఇక అలా వైకుంఠపురములో సినిమా కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా ఈ సినిమాలో  సంగీతం స్వరపరిచాడు తమన్. ఆయన అందించిన బాణీలు అందరినీ కూడా ఒక ఊపు ఊపాయి. ఈ సినిమాలోని బుట్ట బొమ్మ పాట అయితే ఇప్పటికి కూడా ప్రేక్షకుల నోళ్ళలో నానుతోంది అని చెప్పాలి. బుట్ట బొమ్మ అంటూ సాగే పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా అర్మాన్ మాలిక్ ఆలపించాడు.

 ఇక ఈ పాట యువతను ఎంతలా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు యూట్యూబ్ లో కూడా అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా కూడా ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. ఈ పాటలోని ప్రతి లైన్ కూడా యూత్కి బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి. ఒక అద్భుతమైన అర్థం వచ్చే విధంగా ఈ పాటను రాశాడు రామజోగయ్య శాస్త్రి. పాటకు సంబంధించిన కొరియోగ్రఫీకి కూడా యూత్ మొత్తం ఫిదా అయిపోయింది అని చెప్పాలి. కేవలం మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎంతోమందిని ఈ బుట్ట బొమ్మ పాట ఆకర్షించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన 100 వీడియో సాంగ్స్ లో 15వ స్థానంలో నిలిచి ప్రపంచ రికార్డును సాధించింది. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ పాట ఎవర్గ్రీన్ పాట గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: