'రంగం'లోకి దిగి.. టాలీవుడ్ ను మెప్పించిన జీవా?
కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జీవా హీరోగా నటించాడు.. ఇక జీవా సరసన కార్తీక హీరోయిన్గా నటించి తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక హరీష్ జయరాజ్ అందించిన సంగీతం అయితే ఈ సినిమాకి ప్రాణం పోసింది. ఇక ఈ సినిమాలోని పాటలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను నోళ్ళలో నానాయి రంగం సినిమా పాటలు. అంతల ఈ సినిమా స్టొరీ తో పాటు సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
విద్యార్థి నాయకుడిగా ఉన్న ఒక యువకుడు రాజకీయ నాయకుడిగా కావాలని భావిస్తాడు. ఈ క్రమంలోనే ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ మెరుగైన పాలన అందించాలి అని భావిస్తూ ఉంటాడు. అతనికి ఇక మీడియా రంగంలో ఉన్న ఒక స్నేహితుడు రహస్యంగా మద్దతు ఇవ్వడం చేస్తూ ఉంటాడు. ఇక చివరికి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా మారిపోవటం ఎన్నో కుళ్లు కుతంత్రాలతో ఉన్న రాజకీయాలకు నాంది పలకడం తో చివరికి స్నేహితుడు చేతిలోనే ప్రాణాలు కోల్పోతాడు. అయితే చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది అన్న విషయాన్ని ఇక ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు.