దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అప్పుడప్పుడే వరుస విజయాలు అందుకుంటున్న రోజులని తెలుస్తుంది.. ఆయనకు ఆ సమయంలో ఓ కోరిక కలిగిందట ఓ స్టార్ హీరోతో ఓ డ్యూయల్ రోల్ సినిమా చేయాలని అప్పటికే ఆయన అక్కినేని నాగార్జునతో 'వారసుడు' అనే చిత్రాన్ని తీశారని తెలుస్తుంది.. పైగా నాగ్ తో మంచి పరిచయం తో పాటు సాన్నిహిత్యం కూడా ఉందని అందుకే నాగార్జున ద్విపాత్రాభినయంగా 'హలో బ్రదర్' సినిమాని ప్లాన్ చేశారట ఈవీవీ సత్యన్నారాయణ . కథ బాగా వచ్చిందట తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడానికి నాగార్జున కూడా ఆసక్తి చూపించాడని తెలుస్తుంది.
ఇక నాగార్జున సరసన ఒక హీరోయిన్ గా సౌందర్యను ఫైనల్ చేశారని వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ఇదేనని సమాచారం.అన్నపూర్ణ స్టూడియోలో 'ప్రియ రాగాలే' పాట చిత్రీకరణతో ఈ 'హలో బ్రదర్' చిత్రం షూటింగ్ స్టార్ట్ అయిందని తెలుస్తుంది.ఈ సాంగ్ షూట్ సమయంలోనే మొదటిసారి సౌందర్య మరియు నాగార్జున కలుసుకున్నారని సమాచారం.ఆమె నటన చూసి నువ్వు గొప్ప నటిగా పేరు తెచ్చుకుంటావు అని అప్పుడే నాగ్ చెప్పారని తెలుస్తుంది.
నాగార్జునకు మంచి జడ్జ్ మెంట్ ఉందని టాలెంట్ ను బాగా గుర్తించగలడని తెలుస్తుంది.ఇక 'హలో బ్రదర్' విషయానికి వస్తే రెండు పాత్రల్లో ఒక పాత్ర చిన్న సైజు దొంగ అని మరో పాత్ర పాప్ సింగర్ పాత్ర అని అందరికి తెలుసు.రెండు పాత్రల్లో నాగార్జున అద్భుతంగా నటించారని తెలుస్తుంది. అయితే, కొన్ని సన్నివేశాల్లో ఈ రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్ లో కనిపించాల్సి ఉందని కాబట్టి, నాగ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే బాడీ కావాలని హీరో శ్రీకాంత్ అయితే బాగుంటాడని అనుకున్నారట.
ఆయన ప్రస్తుతం హీరోగా చేస్తున్నాడని నాగార్జునకు డూప్ గా చేస్తాడా ఈవీవీ మొహమాటపడుతూనే వెళ్లి శ్రీకాంత్ కి విషయం చెప్పారని తెలుస్తుంది. శ్రీకాంత్ చేస్తాను అని నాగ్ కి డూప్ గా నటించాడని సమాచారం.అలా 'హలో బ్రదర్' సినిమా మొదలైందట.ఈ చిత్రాన్ని దర్శకుడు ఈవీవీ పూర్తి వినోద భరితంగా తీర్చిదిద్దారని అందరికి తెలుసు.. పైగా నాగార్జున చేత మొదటిసారి పూర్తి స్థాయి కామెడీ పాత్రను పోషించేలా చేశారట ఈవీవీ . . అయితే ఈ చిత్ర విజయం పై ఎందుకో నాగార్జునకు మొదటి నుంచీ నమ్మకం లేదని తెలుస్తుంది.
సినిమా విజయం సాధించదని బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టడం ఖాయం అని నాగార్జున బలంగా నమ్మారని సమాచారం.అందుకే, ఆయన ఈ సినిమాను సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తుంది.. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 'హలో బ్రదర్' అద్భుత విజయాన్ని సాధించిందని సమాచారం. 1994వ సంవత్సరంలో రిలీజ్ అయిన చిత్రాల్లో 'హలో బ్రదర్' టాప్ గ్రాసర్ గా నిలిచిందని తెలుస్తుంది.