డైరెక్షన్ పై గురి పెట్టిన యంగ్ హీరో?

VAMSI
టాలీవుడ్ మాస్ విత్ రొమాంటిక్ చిత్రాలకు దర్శకుడు పూరి జగన్నాథ్ పెట్టింది పేరు. ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చిన ఈ డైరెక్టర్ తన తనయుడు ఆకాష్ ను హీరోగా నిలబెట్టడానికి ఇపుడు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.
బాల నటుడిగా ఆకాష్ ని పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటింపచేసిన పూరీ ఇపుడు హీరోగా కూడా తన తనయుడికి సక్సెస్ అందించాలని తెగ ఆరాటపడుతున్నాడు. మొదట్లో "ఆంధ్ర పోరి" సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆకాష్ పూరీ సక్సెస్ ను అందుకోలేకపోయాడు, ఆ తరవాత "మెహబూబా" సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా వస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ సినిమాతో ఎలా అయినా తన కొడుకుకి సక్సెస్ ను అందించాలని ఫుల్ కసిగా ఉన్నారు పూరి జగన్నాథ్ .

అందుకే డైరెక్షన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారట. సినిమా పేరు వింటేనే మూవీలో రొమాన్స్ బాగా దంచి ఉంటారని అందరికీ అర్థమవుతుంది. అయితే ఇదే అంశంపై రీసెంట్ గా పెదవి విప్పిన ఆకాష్ పూరి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియ చేశాడు. సినిమా మొదలయిన సమయంలో... ట్రైలర్ కోసం షార్ట్స్ చూసి రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంది అని భయపడ్డాను, నిజానికి రొమాన్స్ చేయడం చాలా కష్టం, అలాంటప్పుడు సెట్లో చాలాసార్లు భయం వేసింది అని ఒక ఒకానొక సందర్భంలో పారిపోదామని కూడా అనుకున్నాడట ఆకాష్. ఈ విషయమై ఓ సారి తండ్రి పూరి వద్దకు వెళ్ళి సినిమాలో కాస్త రొమాన్స్ తగ్గించమని కూడా అడిగాడట...అందుకు పూరి మూవీ పేరే రొమాంటిక్ అయితే రొమాన్స్ తగ్గించాలని అంటావ్ ఏంట్రా అన్నారట.

ఇక సినిమా విషయానికి వస్తే ట్రైలర్ లో రొమాంటిక్ గా చేశామే తప్ప సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ వంటివి మెండుగా ఉన్నాయని ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఆకాష్ అన్నాడు. విడుదలయ్యాక ఈ వార్త ఒకరి నుంచి మరొకరికి మౌత్ టాక్ ద్వారా బాగా స్ప్రెడ్ అవుతుందన్న నమ్మకం తనకు ఉందని అతడు తెలిపాడు. ఇక తనకి సినిమాలను డైరెక్ట్ చేయడమంటే చాలా ఇష్టమని... హీరోగా సెటిల్ అయ్యాక ఓ పదేళ్లు దాటితే డైరెక్షన్ రంగంలోకి దిగాలని ఉందని చెప్పుకొచ్చాడు ఈ అందరు కుర్రాడు. ఇక ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ అన్న మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అన్న చాలా ఇష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: