చిన్న పల్లెటూరులో పుట్టి గొప్ప హీరోగా మారిన మోహన్ బాబు...
పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్న ఈ మహనీయుడు చిత్తూరు వాస్తవ్యుడు. ఆంధ్రప్రదేశ్ లోని, చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం లోని మోదుగులపాళెం. అప్పట్లోనే డిగ్రీ ని కూడా పూర్తి చేశారు, సినిమాల్లోకి రాకముందు వ్యాయామ ఉపాధ్యాయుడుగా కూడా పనిచేశారు. మోహన్ బాబు విద్యాభ్యాసమంతా ఏర్పేడు, తిరుపతిలోనేజరిగింది. ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో అలరించి అశేష అభిమాన గణాన్ని సాధించిన మోహన్ బాబును ఒకప్పుడు నువ్వు హైదరాబాద్ చూడగలవా అని కూడా అన్నారట, నటుడు కావాలనే ఆయన తపన ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఆయన జన్మ స్థలం మోదుగులపాలెం అంటే ఆయనకు చాలా ప్రీతి.
ఎంత బిజీగా ఉన్నా సమయం దొరికితే చాలు సొంత గూటికి వాలిపోతుంటారు. అలాగే ఆయన పిల్లలు మంచు లక్షి, విష్ణు, మనోజ్ లు కూడా సెలవులు వస్తే చాలు వాళ్ల సొంతూరిలోనే గడపడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా మంచు లక్ష్మికి అయితే వారు ఊరు అన్నా, అక్కడి వాతావరణం, అక్కడి ప్రజలు మాట్లాడే విధానం అన్నా చాలా ఇష్టమని చెబుతుంటారు