నాగశౌర్యకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ శాపమా !
ఇలాంటి పరిస్థితులలో ఈవారం విడుదలకాబోతున్న ‘వరుడు కావలెను’ మూవీ పై నాగశౌర్య భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అతడికి అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ శాపంగా మారుతుందా అన్న సందేహాలను ఇండస్ట్రీలో కొందరు వ్యక్త పరుస్తున్నారు. దీనికికారణం ‘వరుడు కావలెను’ సినిమాలోని హీరోయిన్ పాత్రకు కూడ పెళ్ళి పట్ల కన్ఫ్యూజన్.
ఇలా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడటానికి ఆమెకు ఒకకారణం ఉంది. ఇంచుమించు ఇదే పాయింట్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీలోని పూజా హెగ్డే పాత్ర కొనసాగింది. ఈపాత్ర డిజైనింగ్ తో పాటు పూజ హెగ్డే నటన కూడ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో అఖిల్ కోరుకున్న హిట్ దక్కింది. ఇప్పుడు ‘వరుడు కావలెను’ మూవీలో రీతువర్మ పాత్ర కూడ ఇలాగే ఉంటుంది అన్న వార్తలు వస్తూ ఉండటంతో ప్రేక్షకులు మళ్ళీ అదే పెళ్ళి పాయింట్ మీద తీసిన మరొక సినిమాను ఎంతవరకు ఆదరిస్తారో అన్నసందేహాలు కొందరికి ఉన్నాయి.
అయితే ఈమూవీ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈమూవీ ప్రమోషన్ లో ఇస్తున్న లీకులు వేరుగా ఉన్నాయి. ఈమూవీ కథ పెళ్ళి కాన్సెప్ట్ పై తీసినప్పటికీ ఈమూవీ స్క్రీన్ ప్లే అదేవిధంగా ఈమూవీలో వచ్చే భావోద్వేగాలు చాల డిఫరెంట్ గా ఉంటాయని ఆమె చెపుతోంది. దీనికితోడు ఈమూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే 15 నిముషాల స్పెషల్ సీన్స్ ఈమూవీ కథను హైలెట్ చేసి ఈమూవీని హిట్ బాట వైపు నడిపిస్తుందని ఆమె చెపుతోంది. అయితే ఇలాంటి పెళ్ళి కాన్సెప్ట్ సినిమాలు అన్నీ ‘షాది ముబారక్’ మూవీ ఆధారంగా అల్లబడుతున్న కథలు కాబట్టి ఎంతవరకు ఒకేరకం కథలను ప్రేక్షకులు మళ్ళీమళ్ళీ చూస్తారు అన్నది రాబోయే శుక్రు వారం తేలిపోతుంది..