కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ 'పెద్దన్న'. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నిజానికి గత ఏడాది దీపావళి కె ఈ సినిమా విడుదల కావాలి. కానీ షూటింగ్ ఆలస్యం, కరోనా పరిస్థితులవల్ల విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ కి చెల్లెలి పాత్రలో అగ్ర హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ పెద్దన్న సినిమాకు మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాకు మధ్య కొన్ని పోలికలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పెద్దన్న సినిమాలోనూ అటు మెగాస్టార్ భోళాశంకర్ లోనూ కీర్తి సురేష్ చెల్లెలి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
పెద్దన్న సినిమా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా, మెగాస్టార్ భోళాశంకర్ కూడా అదే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. పెద్దన్న సినిమా ట్రైలర్ లో భోళాశంకర్ పోస్టర్ లో కోల్ కత్తా లోని హౌరా బ్రిడ్జిని చూపించడం జరిగింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా తమిళంలో అజిత్ హీరోగా నటించిన 'వేదాలం' సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. దీంతో మెగా అభిమానులకి కంగారు ఎక్కువయ్యింది. ఈ రెండు సినిమాలలో కీర్తి సురేష్ చెల్లెలి పాత్ర పోషించడం.. ఈ రెండు సినిమాలకు చెల్లెలి పాత్రే కీలకం కావడం గమనార్హం. అయితే కొంతమంది అభిమానులు మాత్రం ఈ రెండు సినిమాలకూ దగ్గరి పోలికలు ఉన్నా..
కథ విషయంలో కచ్చితంగా తేడాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ నటించిన పెద్దన్నయ్య సినిమా రిలీజ్ అయితే ఈ రెండు కథలలోనూ పోలికలు ఉన్నాయో లేవో క్లారిటీ అనేది వస్తుంది. ఇక మెగాస్టార్ భోళాశంకర్ సినిమా వచ్చే నెల 11న లాంచ్ కానుండగా.. నవంబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మెహర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా ఎవరు హీరోయిన్ గా నటిస్తారు అనే దానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది...!!