హాలీవుడ్ రేంజిలో ఆర్ ఎక్స్ 100 హిందీ రీమేక్ ..

Purushottham Vinay
ఇక కుర్రకారు అప్పుడు పూర్తిగా 'అర్జున్ రెడ్డి' ఫీవర్లో ఉన్నప్పుడు వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల్లో 'ఆర్.ఎక్స్.100' కూడా ఒకటి. నిజానికి ఈ సినిమాకి అప్పుడు రివ్యూలు అంత పాజిటివ్ గా అయితే రాలేదు.కానీ పాటలు సూపర్ హిట్ అవ్వడం అలాగే ట్రైలర్లో హీరోయిన్ గ్లామర్ షో వంటివి ఈ సినిమాకి మంచి భారీ ఓపెనింగ్స్ నమోదయ్యేలా చేసాయి.ఇక దాంతో బయ్యర్స్ పెట్టిన దానికి ఈ సినిమా 5 ఇంతలు రాబట్టింది. నిజానికి ఈ సినిమాకి రూ.10 కోట్ల బడ్జెట్ కూడా పెట్టలేదు. కానీ ఈ సినిమా అప్పుడు సంచలనాలు నమోదు చేసింది.ఇక ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'తడప్‌' అనే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న ఈ సినిమాలో… సునీల్‌ శెట్టి కుమారుడు అహాన్‌ శెట్టి హీరోగా పరిచయమవుతున్నాడు.


ఇక తాజాగా ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ట్రైలర్ ను మన తెలుగు ప్రేక్షకులు కనుక చూసినట్లయితే .. ఇది నిజంగా మన తెలుగు సినిమా రీమేకేనా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ హాలీవుడ్ రేంజిలో వుంది.అంత భారీతనం ఇందులో కనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ ను అయితే మాత్రం చాలా రిచ్ గా తీశారు.ఇక మన తెలుగులో అయితే మాత్రం అంత రిచ్ నెస్ కనిపించలేదు.కానీ బాలీవుడ్ కు వెళ్ళే సరికి ఈ సినిమా పెద్ద భారీ బడ్జెట్ సినిమా అయిపోయింది. ఇక ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాకు రూ.100 కోట్ల వరకు బడ్జెట్ పెట్టేశారేమో అనిపిస్తుంది.భవిష్యత్తులో ఈ కుర్ర హీరో పలువురు స్టార్స్ కి పోటీ కూడా కావొచ్చు. ఎందుకంటే ఇందులో అహన్ శెట్టి యాక్టింగ్ కూడా చాలా సహజంగా కనిపిస్తుంది.ఇక ఈ సినిమా కనుక హిట్ టాక్ తెచ్చుకుందంటే ఖచ్చితంగా అహన్ శెట్టి ఓవర్ నైట్ స్టార్ హీరో అవ్వడం ఖాయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.చూడాలి ఇక అహన్ శెట్టి ఈ సినిమాతో ఎంత పెద్ద స్టార్ హీరో అవుతాడనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: