నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ చిత్రం విడుదల తేదీని తొందర్లోనే ప్రకటించబోతున్నట్లు గా ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తుంది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం కూడా ఆ నెలలోనే సినిమా ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి గా కంప్లీట్ చేసుకుంది.
దీని తర్వాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్న ఈ సినిమాకి స్క్రిప్ట్ కూడా దాదాపు ఫైనల్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. కేవలం నాలుగు నెలల సమయంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే విధంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేశారట. అయితే ఈ సినిమా లో బాలయ్య కు పోటాపోటీగా నటించబోయే విలన్ పాత్రకు ఎవరిని తీసుకోవాలి అన్న చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతుండగా ఆయన ను ఢీకొట్టే అంటే విలన్ అంటే ఆయన రేంజ్ లో ఉండాలి అని ఆయన అభిమానులు కొంతమందిని సజెస్ట్ చేస్తున్నారు.
అలా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమా లో లేడీ విలన్ గా నటించబోతున్నట్లు ఆ మధ్య కొన్ని కథనాలు వినిపించాయి. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన కూడా ఇవ్వలేదు మేకర్స్. తాజాగా ఈ సినిమా లో సీనియర్ హీరో అర్జున్ విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన తెలుగు లో పలు సినిమా ల్లో కీలక మైన పాత్రల్లో నటించగా తమిళ సినిమా లలో విలన్ గా కూడా చేశాడు. ఇప్పుడు ఈ చిత్రంలోనూ ఆయన్ని చూడొచ్చు అన్నమాట. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆయన్ని సంప్రదించడం అలాగే ఆయన ఒప్పుకోవడం కూడా జరిగిపోయాయట. మరి బాలయ్య తో తలపడబోయే అర్జున్ ఈ సినిమాతో ఎంతటి క్రేజ్ ను అందుకుటాడో చూడాలి.