పుష్ప
సినిమా ఎప్పుడైతే పాన్
ఇండియా సినిమా గా మారిందో ఎప్పుడైతే ఆ
సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందో అప్పటినుంచి
అల్లు అర్జున్ మాటలు కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. అందరినీ కలుపుకుపోయే లా మాట్లాడడం
బాలీవుడ్ టాలీవుడ్ కొలీవుడ్ అంటూ ఇతర పరిశ్రమల గురించి కూడా ఆయన మాట్లాడడం చూస్తుంటే
బన్నీ తన పాన్
ఇండియా సినిమా ను ఇప్పటి నుంచే ప్రమోట్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఆయన హీరోగా పుష్ప అనే పాన్
ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఆయన స్పీచ్ ను గమనిస్తే ఎక్కువగా పాన్
ఇండియా సినిమా అనే మాటలు తరచూ నొక్కి నొక్కి మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో
అల్లు అర్జున్ ఆ సినిమాను ప్రోమోట్ చేసుకుంటున్నాడా లేదా నార్మల్గానే ఆ మాటలు వచ్చాయా అని కొంతమంది సోషల్ మీడియాలో ఆయనను ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఏ
సినిమా ఫంక్షన్ కు వచ్చిన ఆ సినిమాతో పాటు అదే రోజు విడుదల అవుతున్న సినిమాలకు కూడా ఆల్ ద బెస్ట్ చెబుతూ గెస్ట్ గా వచ్చిన హీరోలు మాట్లాడతారు. కానీ
బన్నీ ఇతర భాషలకు సంబంధించిన
సినిమా గురించి మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అలాగే అదే రోజున విడుదల అవుతున్న
రొమాంటిక్ అలాగే రజనీకాంత్ నటిస్తున్న పెద్దన్న సినిమాలు కూడా
సక్సెస్ కావాలని ఆయన కోరుకున్నాడు.