జయసుధ ఎందుకని ఇలా !

Seetha Sailaja
సహజ నటిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న జయసుధ గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. సీనియర్ హీరోలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణంరాజు శోభన్ బాబు లతో పాటు మధ్యతరం హీరోలు బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున చిరంజీవిలతో కూడ ఆమె అనేక సినిమాలలో నటించింది.


గత రెండు సంవత్సరాలుగా ఆమె ఎక్కువగా సినిమాలలో నటించడం లేదు. ఆమె భర్త మరణించిన దగ్గర నుండి ఆమె ఇండస్ట్రీకి కొంతవరకు దూరం అయింది. జయసుధ ఏపాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించడం ఆమె అలవాటు. ‘మా’ ఎన్నికల సమయంలో ఆమె అమెరికా వెళ్ళింది అంటూ ప్రకాష్ రాజ్ స్వయంగా చెప్పడంతో ఎదో ఒక వ్యక్తిగతమైన పని పై వెళ్ళి ఉంటుందని అందరు భావించారు.


ఈ పరిస్థితుల మధ్య ఆమె లేటెస్ట్ లుక్ చూసినవారు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తెల్ల జుట్టుతో బాగా సన్నపడిపోయిన ఆమె లుక్ ను చూసి ఆమె కావాలని డైట్ చేసి కావాలనే వెయిట్ తగ్గారా లేదంటే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ సోషల్ మీడియాలో అప్పుడే చర్చలు మొదలైపోయాయి. ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేస్తున్న ‘జానకి కలగనలేదు’ సీరియల్ ప్రమోషన్ గురించి ఆమె మాట టివిలో మాట్లాడుతూ ‘జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు’ అనే సాంగ్ లో తాను శోభన్ బాబు కలిసి నటించిన విషయాల గురించి వివరిస్తూ అప్పట్లో ఆ పాట సృష్టించిన సంచలనం గురించి వివరించారు.


ఆ సాంగ్‌ ను ఊటీ లో షూట్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఈ సీరియల్ అందరికీ నచ్చుతుంది అంటూ ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఆమె ప్రమోట్ చేస్తున్న ఆ సీరియల్ గురించి కాకుండా అందరు ఆమె ఆరోగ్యం గురించి కూడ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఆమె ఆరోగ్యంగా ఉంటూ ఆమె మరిన్ని సినిమాలలో నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: