యువ కథానాయకుడు నాగశౌర్య ఈ మధ్య వరుసగా చిత్రాలను చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన నటిస్తోన్న తాజా చిత్రం వరుడు కావలెను. పెళ్లి చూపులు బ్యూటి రీతూవర్మ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో వరుడు కావలెను షోలు ప్రదర్శించారు.
ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి.. కథేంటి, కథనం ఎలా ఉన్నది. హీరో, హీరోయిన్స్ ఎలా నటించారు. పాటలు ఎలా ఉన్నాయి, ఏ మేరకు కుటుంబ తరహా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే అంశాలను చర్చిస్తున్నారు. ఇక అక్టోబర్ 27న ఈ చిత్రానికి సంబంధించిన ప్రిరిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్టార్ హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. థియేట్రికల్ రిలీజ్‌కి ముందు అల్లు అర్జున్ లాంటీ స్టార్ హీరో ప్రిరిలీజ్ ఈవెంట్‌కు రావడం సినిమా ఓపెనింగ్స్‌కు కలిసొచ్చే అంశమే.
ఈ చిత్రానికి లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని అందించారు. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్ర బృందం ఇటీవల విడదల చేసిన సంగతి తెలిసిందే. 'దిగు దిగు దిగు నాగ' అంటూ కొనసాగిన ఈ పాట ఇన్స్‌స్టాంట్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నది. తెలంగాణ జానపదం అయిన దిగు దిగు దిగు నాగ అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో రూపొందించి అందరి ఆదరాభిమానులు అందుకున్నది.
ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూరిచారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాటను పాడారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట నెటిజన్స్‌ను ఆకర్షణీయంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటపై కొందరూ విమర్శలు కూడ చేశారు. ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారిందని.. భక్తి గీతాన్ని తీసుకొచ్చి మసాలా పాటగా మార్చారని దీనిపై నెటిజన్లు భగ్గుమన్నారు. అంతేకాదు డాన్స్ మాస్టర్ శేఖర్‌పై కూడ మండిపడ్డారు. ఈ చిత్రంలో నాగశౌర్య, రీతువర్మ హీరో, హీరోయిన్స్‌గా నటిస్తుండగా, నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ప్రధాన పాత్రలు పోషించి తమ నటనను ప్రదర్శించారు. ఇది ఇలా ఉండగా.. ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు కొందరూ బాగుందని, మరికొందరూ బాగోలేదని.. ఎవరికీ నచ్చినట్టు వారు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.