కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇవాళ గుండె పోటు తో మరనించిన విషయం మన అందరికీ తెల్సిందే. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి తీవ్ర విషాదం లోకి నెట్టి వేయ బడింది కన్నడ చిత్ర పరిశ్రమ. ఇక పునీత్ రాజ్‌కుమార్ మృతి పట్ల సినీ ప్రముఖులు ఇతరులు అందరూ తమ సంతపాన్ని వ్యక్తం చేతునే ఉన్నారు. ఈ నేపథ్యంలో నె ఓ ఏమోషనల్ ట్వీట్ చేశారు జన సేన అధినేత పవన్ కళ్యాణ్. పునీత్ రాజ్‌కుమార్ నటించిన 'బెట్టాడ హూవు' సినిమా పోస్టర్ ను షేర్ చేశారు పవన్. తనకు ఆ సినిమా అంటే చాలా ఇస్తామని ట్వీట్ చేశారు పవన్. 'శ్రీ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక & దురదృష్టకర మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది.
బాలనటుడిగా తన మొదటి చిత్రం 'బెట్టాడ హూవు'లో అతని నటన నా మదిలో బాగా నాటుకుపోయింది. ఎప్పటి నుంచో నేను అతనిని మెచ్చుకున్నాను." అని పేర్కొన్నారు జన సేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక అంతకు ముందు కూడా పునీత్ రాజ్ కుమార్ మృతి పై స్పందించారు పవన్ కళ్యాణ్. "బరువెక్కిన హృదయంతో ‘నా ప్రియమైన సోదరుడు పునీత్’ నీ అంతిమ యాత్రలో నిన్ను ఆదుకోవాలని సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నాను. శ్రీ శివ రాజ్ కుమార్ మరియు శ్రీ పునీత్ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి." అంటూ ట్వీట్ చేశారు జన సేన అధినేత పవన్ కళ్యాణ్.
అటు నందమూరి బాలయ్య కూడా తన దైన స్టైల్ లో సపాదించారు. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అప్పు మృతి తో గొప్ప స్నేహితుడిని కోల్పోయానని ఆవేదన వీఆఖతం చేశారు నందమూరి బాలకృష్ణ. పునీత్ మృతి కన్నడ చలనచిత్ర పరిశ్రమకు తీరని నష్టమని.. బాల నటుడి గా సినీ రంగ ప్రవేశం చేసి హీరోగా, గాయకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, నిర్మాతగా అనితర ప్రతిభ ప్రదర్శించాడని కొనియాడారు నందమూరి బాలకృష్ణ. తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందాడని.. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నానని ట్వీట్ చేశారు నందమూరి బాలకృష్ణ.
.