సినిమా వారిని ఇంతలా ప్రేమిస్తారా?

VAMSI
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఇటు టాలీవుడ్ అటు శాండల్ వుడ్ కన్నీరు మున్నీరవుతోంది. ఈ ప్రపంచంలో ఎవ్వరు చనిపోయినా ప్రజలు పట్టించుకోరు. కానీ ఒక్క రాజకీయ నాయకుడు లేదా సినిమా సెలబ్రిటీ చనిపోతే ఎంతో వేదనకు గురవుతారు. ఎందుకంటే వీరిద్దరూ నిరంతరం ప్రజల జీవితంతోనే ముడిపడి ఉంటారు. రాజకీయం మరియు సినిమా అనేది మన జీవితంలో ఒక భాగం. మన దేశం బాగు పడాలంటే ఒక రాజకీయ నాయకుడు అవసరం, అలాగే మనము బాధలో ఉన్నప్పుడు కొంచెం రెఫ్రెష్మెంట్ కావాలంటే సినిమా చూస్తాము. ఇలా ఈ రెండు అంశాలు మనతో బాగా కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే వారికి ఏ కష్టమొచ్చినా మనము అల్లాడిపోతూ ఉంటాము. అయితే అలాంటిది మనిషే చనిపోతే ఇంకెంత బాధ ఉంటుంది.

ఈ రోజు సరిగ్గా అదే జరిగింది, కన్నడ నాట సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న పునీత్ రాజ్ కుమార్ ఈ రోజు హఠాత్తుగా గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో మరణించడం జరిగింది. ఈ దుర్ఘటన ఒక్కసారిగా విషాధచాయలు అలుముకునేలా చేసింది. ఒక సినిమా సెలెబ్రిటీకి ఈ స్థాయిలో అభిమానం ఉండ అనేదానికి ఒక సరైన ఉదాహరణ అని చెప్పాలి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్త తెలిసిన వెంటనే కర్ణాటక మొత్తానికి హై అలెర్ట్ ప్రకటించింది. మరి రెండు రోజుల పాటుగా థియేటర్స్, స్కూల్స్, కాలేజెస్ లాంటి అన్ని పబ్లిక్ ప్లేస్ లను మూసివేయాల్సిందిగా డిఎస్పీ తెలిపారు.

ఇది కల నిజమా అన్నంత స్థాయిలో అభిమానులు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. తెలిసిన సమాచారం ప్రకారం ఒక అభిమాని ఈ వార్త విని తట్టుకోలేక మరణించినట్లు చెబుతున్నారు. ఈ రోజు పోటెత్తి వస్తున్న జనసంద్రమే చెబుతుంది ఎంతలా పునీత్ ను అభిమానిస్తున్నారో,  ఇంత చిన్న వయసులోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ ఆత్మ ఏ లోకాన ఉన్నా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: