ద్విపాత్రాభినయానికి నో.. మల్టీ స్టారర్ కి ఎస్?
ఇక మొన్నటి వరకు కొంత మంది హీరోలు ఇలా ద్విపాత్రాభినయం తో కూడిన సినిమాలు చేయడానికి కాస్త ఆసక్తి చూపించారు. అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలు చేసి ద్విపాత్రాభినయం ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఇటీవలి కాలంలో హీరోలు ఎవరూ కూడా ద్విపాత్రాభినయం కాన్సెప్టుతో ఉన్న సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. అదే సమయం లో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు స్టార్ హీరోలు. ఇలా డబల్ రోల్ ఉన్న సినిమాలు చేస్తే కాస్త రిస్క్ ఎక్కడ తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుంది. అదే మల్టీస్టారర్ సినిమాలు చేస్తే ఇక ఇద్దరు హీరోలకు సంబంధించిన క్రేజ్ కూడా సినిమాకు పనికొస్తుంది.
దీంతో ఇద్దరు హీరోల అభిమానులు కూడా సినిమాను ఆదరించే అవకాశం ఉంటుంది. దీంతో ఇలా మల్టీస్టారర్ సినిమాలు దాదాపు మంచి వసూళ్లను రాబట్టి అవకాశం ఉంటుంది. దీంతో ఇక మల్టీస్టారర్ సినిమా మినిమం గ్యారెంటీ సినిమా గా మారిపోయింది నేటి రోజుల్లో. అందుకే స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు కానీ ద్విపాత్రాభినయం కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలు చేయడానికి మాత్రం కాస్త వెనకడుగు వేస్తున్నారు అని చెప్పాలి. దీంతో ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు ఎక్కడ ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.