వాడి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న నటి..!

Divya
ఇండస్ట్రీ ఏదైనా సరే నటీనటులు ఎప్పుడు.. ఎవరి వల్ల.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పడం చాలా కష్టం.. ఎవరు ఎంతటి ఫేమ్ ను తెచ్చుకున్నప్పటికీ ఎవరో ఒకరు దుర్మార్గుల చేతిలో అమ్మాయిలు మోస పోతూ చివరికి విగత జీవులుగా మారుతున్నారు. ఇంకా అలాంటి వారి లోనే దాదాపు 8 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన శ్రావణి కొండపల్లి కూడా ఒకరు.. 2018 సంవత్సరంలో వచ్చిన భాగమతి అనే సినిమాలో కూడా నటించింది.

ఇక తెలుగు బుల్లితెర సీరియల్స్ విషయానికొస్తే, మౌనరాగం , మనసు మమత వంటి ఎన్నో సీరియల్స్ లో నటించి ఇటు బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నారు శ్రావణి కొండపల్లి. అటు సినీ ఇండస్ట్రీ పరంగా ఇటు బుల్లితెర ఇండస్ట్రీ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రావణి 2020 సెప్టెంబర్ 9వ తేదీన బుధవారం తన ఇంటి బాత్రూంలో ఉరి వేసుకుని మరణించింది. అయితే ఈమె ఒక టిక్ టాక్ స్టార్ అయినా దేవరాజ్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు..

కానీ ఇంట్లో పెద్దలు మందలించడంతో శ్రావణి అతని వైపు చూడలేదు.. కానీ అతను మళ్ళీ పదేపదే ఆమె వెంట పడుతుండటం తో ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కానీ అతడు ఆమె ఫోటోలను తీసి  బెదిరిస్తూ ఉండడం.. లక్ష రూపాయల వరకు శ్రావణి నుంచి తీసుకున్నాడు దేవరాజ్ రెడ్డి. రోజురోజుకు ఇతడి ఆగడాలు ఎక్కువ అవుతున్నప్పటికీ భరించింది..అయితే అతడు ప్రతిసారి శ్రావణినీ బెదిరిస్తూ ఉండడంతో ఆమె పరువు పోతుంది అనే భయంతో తీవ్ర మనస్థాపానికి గురి అయి ఉరి వేసుకుని చనిపోయింది. కేవలం 26 సంవత్సరాల వయసులోనే శ్రావణి మరణించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురయింది. అంతేకాదు ఈమె మరణం వెనుక ప్రముఖ సినీ నిర్మాత అశోక్ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: