ఆ యువ హీరో మరణం.. ఇప్పటికీ మిస్టరీనే?
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలి పోయింది అని చెప్పాలి. ముంబైలోని తన ఫ్లాట్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ యువహీరో సూసైడ్ మాత్రం అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్స్ ఆధిపత్యం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది సెలబ్రిటీలు సైతం ఓపెన్ అయ్యారు. అంతేకాదు సుశాంత్ మరణం వెనుక రహస్యం దాగి ఉంది అంటూ ఎంతో మంది సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
అయితే బుల్లితెరపై ఒక సాదా సీదా నటుడిగా సీరియల్ ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ . ఇక ఆ తర్వాత బుల్లితెరపై ఎన్నో ధారావాహికల్లో నటించిన సుశాంత్.. ఇక వెండితెరపై కూడా ప్రవేశించాడు. వెండితెరపై కూడా వరుస అవకాశాలు అందుకుంటూ అభిమానులను అలరించాడు. అయితే ఎలాంటి పాత్ర చేసిన పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇలాంటి టాలెంట్ వున్న నటుడు అటు చిత్ర పరిశ్రమకు దూరం అవ్వడాన్నీ మాత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేక పోయింది.