మన
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మంది సీనియర్ హీరోల కి హీరోయిన్లను ఎంపిక చేయడం అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు సీనియర్ హీరోలతో నటించడానికి ఇష్టపడడం లేదు. అయితే సీనియర్
హీరో అయినా క్రేజ్ ఉంటేనే కొంతమంది హీరోయిన్లు నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అందులో
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఏడాదికి కనీసం రెండు సినిమాలనైనా రిలీజ్ చేసే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో లో చిరు - బాబి కాంబినేషన్ లో ఓ
సినిమా తెరకెక్కుతోంది.
మరోవైపు అటు
బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో కూడా
శృతి హాసన్ ని హీరోయిన్గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా చిరు -
బాబీ మూవీ లో ఈమె హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి 'వాల్తేరు శీను' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ
సినిమా స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసిన దర్శకుడు బాబి.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ
సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక సినిమాలో
మెగాస్టార్ ని
మాస్ పాత్రలో చూపించబోతున్నాడట దర్శకుడు బాబి...!!