సిల్క్ స్మిత చనిపోవడానికి అదొక్కటే కారణమా?
తనది నిరుపేద కుటుంబం కావడంతో పెద్దమ్మ వరస అయ్యే అన్నపూర్ణమ్మ దగ్గర పెరిగింది. 18 ఏళ్ల వయసులో పెద్దమ్మ అన్నపూర్ణమ్మతో కలసి మద్రాసు వెళ్లి సినిమా అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. "భూదేవి" అనే చిన్న సినిమాలో ఒక చిన్న పాత్రతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత వరుస అవకాశాలతో నటిగా, నర్తకిగా గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల బాషల్లో ఎన్నో చిత్రాలలో నటించి, నర్తించి అలరించింది. ఓ మలయాళ సినిమా చేస్తున్న సమయంలో డైరెక్టర్ ఆమె పేరును స్మిత గా మార్చారు. ఈమె చదివింది నాలుగో తరగతే అయినా జీవితంలో మాత్రం చాలా పాఠాలే నేర్చుకుంది. సినీ రంగంలో బాగా సంపాదించారు.
అయితే చాలా మంది సినిమా వాళ్ళలాగానే దాన్ని నిలబెట్టుకోలేకపోయారని, ఒకానొక సమయంలో చిత్ర నిర్మాణ ప్రయత్నాలలో పూర్తిగా అప్పుల పాలై నగలు కూడా అమ్ముకుని గడిపిన రోజులు ఉన్నాయని అప్పట్లో చాలా రూమర్లు వినిపించాయి. తన ప్రేమ విఫలం కావడంతో ఈమె మద్యం కూడా సేవించేదని తెలిసింది. అలా మానసికంగా కుంగిపోయి స్మిత ఆత్మహత్యకు పాల్పడ్డారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో తెలిసిన కారణం అదేనని ఖచ్చితంగా చెప్పలేము. అయితే దీని వెనుకున్న అసలు కారణం ఎవ్వరికీ తెలియదు. అప్పుడు ఇంతటి టెక్నాలజీ సోషల్ మీడియా లేదు కాబట్టి అది అలా మాసిపోయింది. అయినా నేటికి సిల్క్ స్మిత పేరు మారుమ్రోగుతూనే ఉంది.