రంగమార్తాండ కోసం చిరంజీవి సహకారం !
ఆతరువాత కృష్ణవంశీ ప్రాభవం పూర్తిగా తగ్గిపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు తీసినప్పటికీ ఏ సినిమా కూడ సక్సస్ కాకపోవడంతో టాప్ హీరోలు అతడిని పక్కకు పెడితే మీడియం రేంజ్ హీరోలు కూడ కృష్ణవంశీ ని పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితులలో కృష్ణవంశీ దృష్టి ఒక మరాఠీ సినిమా పై పండిది.
జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమా అవార్డు పొందిన ఒక మరాఠీ సినిమాను కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ మూవీగా మారుస్తున్నాడు. ఒక రంగస్థల నటుడు జీవితంలో ఎదుర్కునే సమస్యల ఆధారంగా ఈ మూవీ ఉంటుంది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో అతడి భార్యగా రమ్యకృష్ణ నటిస్తోంది. వాస్తవానికి ఈసినిమా చాలకాలం క్రితం విడుదల కావలసి ఉంది. అయితే కరోనా పరిస్థితులు అడ్డు తగలడంతో ఈ మూవీ విడుదల ఆగిపోయింది.
ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో ఈ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఈసినిమాకు చిరంజీవి వాయస్ ఓవర్ ఇస్తున్న ఒక ఫోటోను కృష్ణవంశీ షేర్ చేస్తూ మెగా స్టార్ కు కృతజ్ఞతలు తెలియచేసాడు. ఈమధ్య చిరంజీవి చేతికి సర్జరీ జరిగింది. షూటింగ్ లు కూడ క్యాన్సిల్ చేసుకుని మెగా స్టార్ రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినప్పటికీ కృష్ణవంశీ కోరగానే తన అనారోగ్యాన్ని లెక్కచేయకుండా డబ్బింగ్ స్టూడియోకు వచ్చి కృష్ణవంశీ కోరికమేరకు తన వాయస్ ఓవర్ పూర్తి చేసాడు. చాల వాస్తవ దృష్టితో అల్లబడిన ఈకథ సినిమాగా తీస్తున్నప్పటికీ నేటితరం ప్రేక్షకులకు ఎంతవరకు ఇది నచ్చుతుంది అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో కొనసాగుతున్నాయి..