వివిధ కారణాలతో వివాదాలు పాలయిన సినిమాలివే?

VAMSI
సినిమా తీయడం అనేది ఎంత కష్టమో..ఆ సినిమాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలానికి ప్రేక్షకుల ముందుకు  తీసుకు రావడం అంతకన్నా కష్టం. కానీ ఈ విషయం అందరికి తెలియక పోవచ్చు. ఎందుకంటే సినిమా అనేది చెడు అయినా మంచి అయినా ప్రజల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. అందులో చెప్పే విషయాలు నేరుగా ప్రజల మనసుల్లోకి వెళ్లిపోతాయి. ఇలా రక రకాల కారణాల వలన చాలా  సినిమాలు వివాదాల్లో చిక్కుకున్న సందర్బాలు ఉన్నాయి. చిన్న హీరో నుండి అగ్ర హీరోల వరకు కూడా ఎందరో తమ సినిమాలు వివాదాల్లో చిక్కు కోవడం జరిగింది. కొన్ని సినిమాలు రిలీజ్ లేట్ కాగా, కొన్ని చిత్రాలు అసలు విడుదలకు నోచుకోలేదు. ఇక టాలీవుడ్ లో  వివాదాల్లో చిక్కుకున్న సినిమాలు ఏమిటి ఆ మూవీల్లో హీరోలు ఎవరో ఇపుడు తెలుసుకుందాం.  

* మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన "ఖలేజా" సినిమా చిత్ర నిర్మాత సింగనమల రమేష్ వివాదం ముప్ప తిప్పలు పెట్టింది.

* టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ నటించిన "దేవి పుత్రుడు" సినిమా కూడా రిలీజ్ తర్వాత వివాదాల పాలయింది.
   
* అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "కొమరం పులి" సినిమా కూడా నిర్మాత సింగనమల రమేష్ కారణంగా వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.

* శర్వానంద్ నటించిన "రాజాధి రాజా" చిత్రం కూడా పలు వివదాల కారణంగా రెండేళ్ల పాటు రిలీజ్ కు నోచుకోలేదు. ఆ తర్వాత రిలీజ్ అయినా సక్సెస్ కాలేదు.

* స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం ఆర్య 2 సినిమా  తెలంగాణ వివాదం పెద్ద చర్చకు దారి తీసింది.

ఇలా చాలా చిత్రాలు షూటింగ్ పూర్తయిన తరవాత విడుదలకు ఆటంకాలు ఏర్పడగా...కొన్ని చిత్రాలు విడుదలయ్యాక వివాదాలు పాలయ్యాయి, మరి కొన్ని అసలు విడుదలకు ఇప్పటికీ నోచుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: