అఖండ సినిమా బాలయ్య అభిమానులకు విందు భోజనమేనట..!

murali krishna
నటసింహం బాలయ్య చేత మళ్ళీ ఘనంగా గర్జించేలా బోయపాటి శ్రీను అఖండతో భారీగా ప్లాన్ చేశాడని తెలుస్తుంది.

నిజానికి ఈ సినిమా అవుట్ ఫుట్ విషయంలో మొదట్లో చాలా నెగిటివ్ టాక్ ను బయటకు వదిలారని తెలుస్తుంది.ఆ తర్వాత బాలయ్య యాంటీ ఫ్యాన్స్ ఆ టాక్ ను బాగా ప్రచారం చేశారని సమాచారం. దాంతో పరిశ్రమలో కూడా సినిమా బాగా రాలేదని .. అంటూ తమ సినిమాలను బాలయ్య సినిమా పై పోటీగా వదలడానికి సన్నద్ధం అయ్యారని సమాచారం..

ఈ క్రమంలోనే రవితేజ ఖిలాడీ సినిమాను రెండుసార్లు బాలయ్యకు పోటీగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారని తెలుస్తుంది.ఈ లోపు మళ్ళీ కరోనా రావడంతో అన్నీ సినిమాలు రిలీజ్ డేట్స్ ను పోస్ట్ ఫోన్ చేసుకోవడంతో అంతా మొదటికి వచ్చిందని తెలుస్తుంది.అయితే ఈ గ్యాప్ లో కొంతమంది బయ్యర్లకు బాలయ్య సినిమాను చూపించారని తెలుస్తుంది అప్పటికే నెగిటివ్ టాక్ బాగా ఉండటంతో.. బయ్యర్లు కూడా మొహమాట పడుతూ సినిమా చూశారని సమాచారం.

సినిమా పూర్తి అయిన వెంటనే నేరుగా సినిమా నిర్మాత దగ్గరకు పోయి  మాకు దయచేసి.. సినిమాని ఇచ్చేయండి అంటూ రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారని సమాచారం.అప్పటికి గాని మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్లకు అఖండ అవుట్ ఫుట్ అర్ధం కాలేదని తెలుస్తుంది.ఒక్కసారిగా అఖండకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అయిందని సమాచారం.థియేటర్స్ రైట్స్ కోసం పోటీ ఎక్కువ అయిందని తెలుస్తుంది.

దాంతో ఇండస్ట్రీ పర్సన్స్ కు మ్యాటర్ అర్ధం అయిందని సమాచారం. ఓ విధంగా అందరూ షాక్ అయ్యారనే అనుకోవాలని తెలుస్తుంది. ఎందుకంటే బాలయ్య సినిమాకు ఈ లెవెల్ రెస్పాన్స్ అన్నది ఇప్పటి వరకు లేదని భవిష్యత్ లో వుంటుందని గ్యారంటీ కూడా లేదని కాబట్టి  ఈ సినిమాను మిస్ చేసుకోకూడదు అని బయ్యర్లు కాస్త అదనపు రేట్లు ఇచ్చి మరీ సినిమా థియేటర్ రైట్స్ ను ఏరియాల వారీగా సొంతం చేసుకుంటున్నారని తెలుస్తుంది

సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఎలాంటి మ్యాజిక్ జరగలేదని పైగా ఆ సినిమాకు భారీ నష్టాలు వచ్చాయని తెలుస్తుంది. అయితే అఖండ సినిమా విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితి ఉందని సమాచారం. అఖండ సినిమాకు భారీ హైప్ వచ్చిందని అందుకే బాలయ్య ఫ్యాన్సు కు అఖండ విందు భోజనమే అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: