అల్లు అరవింద్ ఆహ ఓటిటి సంస్థలో ప్రసారమవ్వబోతున్న సంచలనమయిన టాక్ షో.. ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె’. అని అందరికి తెలుసు.
నందమూరి బాలకృష్ణ తొలిసారి వెండితెరపై హోస్టింగ్ చేస్తున్న ఈ టాక్ షో కి మంచు మోహన్ బాబు ఫస్ట్ గెస్టుగా హాజరయ్యాడని తెలుస్తుంది.. అసలే హోస్ట్ బాలయ్య అని ఆపై గెస్టుగా మోహన్ బాబు అని ఇద్దరు ముక్కుసూటిగా మాట్లాడేవారే అని అందరికి తెలుసు.ఇద్దరు ఫైర్ బ్రాండ్సే అని అలాంటి వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ టాక్ షో ప్రోమో తాజాగా విడుదలవ్వగా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిందని తెలుస్తుంది.క్లాసీ షేర్వాణీ మరియు శాలువా ధరించి ప్రోమోలో బాలయ్య ట్రెడిషనల్ మరియు రాచరిక లుక్ లో కనిపించిన బాలయ్య మోహన్ బాబుకి తనదైన శైలిలో ప్రశ్నలు వేసి అలరించాడని తెలుస్తుంది.రాజకీయ మరియు సినిమా అలాగే పర్సనల్ విషయాలతో పాటు పలు ప్రశ్నలు వేసి జవాబులను రాబట్టారట బాలకృష్ణ. మెగాస్టార్ చిరంజీవితో రిలేషన్ షిప్ పై బాలయ్య ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తుంది. అలాగే కామెడి కూడా బాగానే పండిందని తెలుస్తుంది.ఒక పర్సనల్ క్వశ్చన్ అంటూ బాలకృష్ణ అనగానే మోహన్‌బాబు విస్కీనా? అని అనటం వెంటనే బ్యాగ్రౌండ్లో ఏక్ పెగ్ లా అనే పాట రావడం నవ్వులు పూయిస్తుందని తెలుస్తుంది.
ఇక హీరోగా నిలబడాలనుకుంటున్నప్పుడు విఫలమవుతుండగా ఎప్పుడైనా బాధపడ్డారా అని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు మోహన్‌బాబు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని తెలుస్తుంది. ఇవన్నీ ఒకెత్తయితే రివర్స్ లో మోహన్ బాబు బాలయ్యని అడిగిన ఓ ప్రశ్న ఇప్పుడు అన్నింటికంటే సంచలనమవుతుందని తెలుస్తుంది.ఒకరకంగా చంద్రబాబు అంటే పడని నికార్సైన అసలు సిసలు నందమూరి అభిమానుల మదిలో ఉన్న ఈ ప్రశ్నని ఏమాత్రం భయపడకుండా మోహన్ బాబు అడిగేశాడని తెలుస్తుంది. అన్న గారు అయిన మీ తండ్రి నందమూరి తారకరామా రావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన తదనాంతరం మీచేతిలో పెట్టుకోకుండా చంద్రబాబుకి అస్సలు ఎందుకిచ్చావ్ అంటూ బాలయ్య కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా అడిగేశాడట మోహన్ బాబు. దానికి కౌంటర్ గా బాలయ్య మాట్లాడుతూ మరి అన్నగారి పార్టీని వదిలేసి మరో పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యావ్ అంటూ మోహన్ బాబుని అడుగగారని తెలుస్తుంది. దానికి బదులుగా ఫిట్టింగ్ పెడుతుంటాడు ఒకాయన అంటూ మోహన్ బాబు పరోక్షంగా చంద్రబాబుని అన్నట్టు ప్రోమోలో కనపడుతుందని తెలుస్తుంది. ఏదేమైనా బాలయ్య స్థాయిలో అలాగే స్టైల్లో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె ఫస్ట్ ఇంటర్వ్యూ ఉండటంతో ఈ షోపై అంచనాలు భారిస్థాయికి చేరాయని తెలుస్తుంది. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రసారం కానుందని సమాచారం.