తన నటనతో రవితేజకే మంచి హిట్ ఇచ్చిన చైల్డ్ యాక్టర్..!!

Divya
సాధారణంగా చిన్నపిల్లలు నటించే ఏ సినిమాలు అయినా సరే మంచి విజయాన్ని అందుకున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. అంతే కాదు ఈ చిన్న పిల్లలకు రచయితలు రాసే డైలాగులు కారణంగా కూడా వీరు ఆ సినిమాలకు హైలెట్ గా నిలుస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.. ఒక సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ కు ముందే ప్రోమో విడుదల చేసేటప్పుడు.. ఈ చిన్నారుల పంచ్ డైలాగులు కూడా వదులుతూ ఉంటారు మేకర్స్.. అలా ఈ పిల్లల మాటలకి ప్రోమో సమయంలోనే ప్రేక్షకులు ఆకర్షితులవుతారు.. ఇక ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోక తప్పదు..

ఇక అలా  మాస్ మహారాజా రవితేజకే తన బుల్లి బుల్లి మాటలతో రవితేజ పై పంచ్ డైలాగులు వేస్తూ మంచి విజయాన్ని తీసుకొచ్చాడు ఒక చైల్డ్ యాక్టర్.. గత కొన్ని సంవత్సరాలుగా వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రవితేజకు ఈ సంవత్సరం క్రాక్ సినిమాతో మంచి ఊరట లభించింది. ఇక ఈ సినిమాలో నటించిన సాత్విక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాత్విక్ ముద్దు ముద్దు  మాటలు , రవితేజ పై వేసే పంచ్ డైలాగులు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి..


సాత్విక్ ఎవరో కూడా మనకు తెలిసిన విషయమే.. క్రాక్ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తనయుడే ఈ సాత్విక్.. నిజానికి ఈ సినిమాలో రవితేజ కొడుకుని పెట్టాలని అనుకున్నారు కానీ ఆ అబ్బాయి ససేమిరా అనడంతో, తిరిగి తన కొడుకుని ఈ సినిమాలో పెట్టి చక్కగా డైరెక్ట్ చేశాడు గోపిచంద్ మలినేని. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందించాడు.. అంతేకాదు ఈ సినిమా విడుదలైన గత కొన్ని నెలల పాటు ఈ పిల్లవాడి పేరు మారుమ్రోగిపోయింది.. సాత్విక్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎనలేని అభిమానం. ఇక అందుకే తనకు వెళ్లాలి అనిపించినప్పుడల్లా మహేష్ బాబు దగ్గరకు, తన నాన్నతో పాటు వెళ్లి కలిసి వస్తాడట సాత్విక్.. ఇక తన చదువు పూర్తయిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతాడు అని  గోపీచంద్ మలినేని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: