చిరంజీవి మోహన్ బాబుల మధ్య ఎంటర్ అయిన బాలయ్య !
దీపావళి రోజున స్ట్రీమ్ కాబోతున్న ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ లో బాలకృష్ణతో మోహన్ బాబు మంచు లక్ష్మి మంచు మనోజ్ లతో కలిసి హడావిడి చేయబోతున్నాడు. బాలకృష్ణ ఈ షోలో చాల డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ చాల యాక్టివ్ గా కనిపించడమే కాకుండా ఈ షోకు అతిధిగా వచ్చిన మోహన్ బాబును తన ప్రశ్నలతో ఇరుకున పెట్టడానికి ప్రయత్నించిన ప్రయత్నంలో మోహన్ బాబు చిరంజీవిల మధ్య ఉన్న గ్యాప్ గురించి మరొకసారి చర్చలకు తావు ఇచ్చేలా అవకాశం వచ్చింది.
బాలకృష్ణ నవ్వుతూ చిరంజీవి పై మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పండి అంటూ మోహన్ బాబును అడగగానే మోహన్ బాబు ఏమాత్రం ఖంగుతినకుండా ‘నన్ను ఇలా ఇరికించమని అరవింద్ చెప్పాడా’ ఆంటూ జోక్ చేసాడు. అంతడితో ఆగకుండా మోహన్ బాబు బాలయ్యను ఇరికిస్తూ ఎన్టీఆర్ మరణం తరువాత ముఖ్యమంత్రి పదవి ‘మీరు ఎందుకు తీసుకోలేదు’ అంటూ తన శైలిలో ఇరికించిన విధానాన్ని చూసినవారు ఈ షో సూపర్ సక్సస్ అవుతుంది అన్న అంచనాలకు వచ్చేస్తున్నారు.
ఇప్పటికే ఓటీటీ లలో సీనియర్ హీరోల హవా మొదలైంది ఇప్పుడు బాలకృష్ణ ఎంట్రీతో అక్కడ కూడ పోటీ బాగా పెరగబోతోంది. ఇది ఇలా ఉండగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ బాలకృష్ణతో ఒక సినిమా తీయబోతున్నాడు అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది..