ఘోరంగా మారిపోయిన మెగాస్టార్.. కారణం..?

Divya
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన ఒక ఫోటో బయటికి రావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు..అంతేకాదు చిరంజీవి ఎంతో భయానకంగా మారిపోయాడు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.. ఇకపోతే చిరంజీవి ఇంత ఘోరంగా మారిపోవడానికి గల కారణం ఏమిటి అని ఆరా తీయగా.. అక్టోబర్ 31వ తేదీన ప్రపంచ హాలోవీన్ డే జరిగిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.. ఇక కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా తమ ముఖాలకు రంగులు మార్చుకొని, మరి కొంతమంది అయితే గుమ్మడికాయల ముసుగును కూడా తొడిగి భయపెట్టారు..

ఇక భయంకరమైన దుస్తులు ధరించి, రకరకాల వింతైన గెటప్పుల్లో కూడా ఫన్ క్రియేట్ చేశారు.. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో సరదా హాలోవీన్ పార్టీ వీడియోని కూడా షేర్ చేసి  అందరినీ షాక్ కి గురి చేశాడు.. తన అభిమానులకు హ్యాపీ హాలోవీన్ శుభాకాంక్షలు కూడా తెలిపాడు.. ఇక చిరంజీవి తన మేకోవర్ కోసం సరికొత్త యాప్ ని ఉపయోగించారని తెలుస్తోంది. అంతేకాదు ఈ వీడియోని ఆయన షేర్ చేస్తూ ఉత్కంఠభరితమైన రోజు అని కింద క్యాప్షన్ కూడా పెట్టారు.


ఈ వీడియోలో చిరు తన ముఖాకృతిని మార్చుకుంటూ ఎంతో చమత్కారంగా మనకు కనిపిస్తాడు.. ఆయన కళ్లు ఎర్రబడటం.. తర్వాత విభిన్నమైన ఆహార్యంతో కనిపించడం చూస్తే ఎంతో ఫన్ గా అనిపించింది.. అంతేకాదు ఈ వీడియోని ఆయన మనవడు, మనవరాలు కూడా చూసి ఎంతో అద్భుతంగా ఉంది అంటూ కితాబు కూడా ఇచ్చేశారు.. ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఈయన నటించిన ఆచార్య సినిమా 2022 ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కాబోతోంది. ఇక తర్వాత గాడ్ ఫాదర్ భోళా శంకర్ , వాల్తేర్ శీను వంటి సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: