కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

praveen
మెహ్రీన్ ఫిర్జాదా.. ఈ అమ్మడి అందానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇప్పటివరకూ ఎంతోమంది హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ సొగసరి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ దాదాపు చాలా మంది హీరోలతో నటించింది  చెప్పాలి. ఇక ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు అనే సినిమాతో బాగా గుర్తింపు సంపాదించుకుంది  మెహ్రీన్ ఫిర్జాదా.


 అయితే మొన్నటి వరకు బొండు మల్లెలా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు జీరో సైజ్ ట్రై చేసి సన్నగా మారిపోయింది. అయితే ఒక్కసారిగా బరువు తగ్గి సన్నగా అవ్వడం తో ఈ అమ్మడిని చూసి తెలుగు ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న f3 సినిమాలో నటిస్తున్న ఈ హీరోయిన్  అదే సమయంలో మరికొన్ని సినిమాలతో కూడా బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఇటీవలే విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు మారుతి తెరకెక్కించిన మంచిరోజులు వచ్చాయి అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది మెహ్రీన్.



 ఈ క్రమంలోనే ఇక ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీవాలి సందర్భంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అయితే ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఈ క్రమంలోనే దర్శకుడు మారుతీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మెహ్రీన్ ఫిర్జాదా. దర్శకుడు మారుతి అంటే తనకు నమ్మకం అని తెలిపింది మెహ్రీన్ ఫిర్జాదా.  ఆయన దర్శకత్వంలో నటించిన మంచి రోజులు వచ్చాయి అన్న సినిమా ఈనెల 4వ తేదీన విడుదల కాబోతున్నట్లు తెలిపింది. అయితే తాను కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఓ రోజు మారుతి సార్.. నుంచి కాల్ వచ్చింది సినిమా చేయాలని కోరగా  కథ కూడా వినకుండా ఒప్పుకున్న. ఎందుకంటే మహానుభావుడు సినిమాలో తనను బాగా చూపించినట్లుగానే మరో సినిమాలో కూడా చూపిస్తాడు అన్న నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: