'వావ్.. స్టన్నింగ్' ఆర్ ఆర్ ఆర్ గ్లింప్స్ పై మహేష్ ట్వీట్ వైరల్..

Purushottham Vinay
'బాహుబలి' సిరీస్ తో తెలుగు సినిమా మార్కెట్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిన భారతదేశం గర్వించదగ్గ పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా "ఆర్ఆర్ఆర్". ఇక ఈ సినిమా 2022 లో జనవరి 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకోగా తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపైన విపరీతంగా తమ దృష్టిసారించింది చిత్ర బృందం. ఇక ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం 'ఆర్ఆర్ఆర్' సినిమా గ్లింప్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక కేవలం 45 సెకన్ల పాటు వున్న ఈ గ్లింప్స్ నిజంగా చూసేవాళ్ళకి వేరే లెవెల్ లో గూస్ బంప్స్ తెప్పించిందనే చెప్పాలి.ఇక ఈ గ్లింప్స్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబునే విపరీతంగా ఆకట్టుకుందంటే ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ గ్లింప్స్ చూసిన మహేష్ వావ్.. స్టన్నింగ్ అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

https://twitter.com/urstrulyMahesh/status/1455117752964825090?t=HMhWPVWoO2Jo8wSpLcN4fg&s=19

ఇక ఈ సినిమాలో తెలంగాణా ఫ్రీడమ్ ఫైటర్ కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండగా, కోనసీమ ఫ్రీడమ్ ఫైటర్ మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ ఇంకా అలాగే మలయాళ భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా వేరే లెవెల్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. చిన్న డైరెక్టర్ లతోనే రికార్డులు సృష్టిస్తున్న మహేష్ ఇక రాజమౌళి సినిమాతో సరికొత్త చరిత్ర రాయడం ఖాయమంటున్నారు సినీ వర్గాల వారు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ "సర్కారు వారి పాట" సినిమాని చేస్తున్నాడు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: