దిల్ రాజ్ తో చేతులు కలుపుతున్న రాజమౌళి !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాకుండానే రాజమౌళి మహేష్ తో వచ్చే ఏడాది తీయబోయే మూవీ గురించి ప్రాధమిక చర్చలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ ప్రాజెక్ట్ కు ప్రముఖ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తాడు అంటూ ఇప్పటివరకు వార్తలు వచ్చాయి.


అయితే రాజమౌళి ఈవిషయంలో గోపాల్ రెడ్డి అంగీకారంతో ఈభారీ ప్రాజెక్ట్ లోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ను కూడ ఆహ్వానిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికికారణం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ తో నిర్మాణం జరుపుకోబోతున్న ఈమూవీ హాలీవుడ్ మూవీల స్థాయిలో భారీ బడ్జెట్ తో తీయాలని రాజమౌళి భావిస్తున్నట్లు టాక్. ఇంత భారీ బడ్జెట్ ఒక్క నిర్మాత గోపాల్ రెడ్డి మాత్రమే సమకూర్చలేడు కాబట్టి ఈప్రాజెక్ట్ లోకి దిల్ రాజ్ ను కూడ ఆహ్వానిస్తే పెట్టుబడి విషయంలో కానీ అదేవిధంగా మార్కెటింగ్ విషయంలో కానీ ఎలాంటి సమస్యలు ఉండవు అనీ రాజమౌళి ఆలోచన అంటున్నారు.


దీనికితోడు గత కొన్ని సంవత్సరాలుగా సినిమా నిర్మాణానికి గోపాల్ రెడ్డి దూరంగా ఉంటున్న పరిస్థితులలో నేటి పరిస్థితులకు అనుగుణంగా దిల్ రాజ్ సలహాలు కూడ నిర్మాత గోపాల్ రెడ్డికి ఉంటే అతడికి మూవీ నిర్మాణ విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవు అన్నది జక్కన్న అభిప్రాయం అని అంటున్నారు. అయితే ఎప్పటి నుంచో మహేష్ రాజమౌళిల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న గోపాల్ రెడ్డి దిల్ రాజ్ రంగ ప్రవేశానికి ఎంతవరకు అంగీకరిస్తాడు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న అని అంటున్నారు.


పరిస్థితులు ఇలా ఉండగా విజయేంద్ర ప్రసాద్ ఈసినిమాకు సంబంధించి ఇప్పటికే సమకూర్చిన కథలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ కు సూచించాడు అని వార్తలు వస్తున్నాయి. అనుకున్న విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ బ్లాక్ బష్టర్ హిట్ అయితే జక్కన్న ఈమూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రారంభించే ఆస్కారం ఉంది. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ ఫలితంలో ఏమైనా తేడా వస్తే రాజమౌళి ఈమూవీ కథ గురించి మళ్ళీ ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసే ఆస్కారం ఉంది అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: