పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియుం అనే సినిమాకి రీమేక్ కాగా యువ దర్శకుడు సాగర్ చంద్ర ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నాడు. ప్రముఖ రచయిత టాలీవుడ్ గురూజీ త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు.
దగ్గుబాటి రానా మరో హీరోగా నటిస్తుండగా ఈ చిత్రంలో పవన్ కి భార్యగా నిత్యమీనన్ అలాగే రానా సరసన సంయుక్త మీనన్ కనిపించనుంది. ఇప్పటికే తమన్ సంగీతం సమకూర్చిన రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు రాగా అవి వారిని ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. కథ ప్రకారం ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.
ఓ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ ఇంటిని రానా కూల్చి వేస్తాడు. ఇప్పటికే ఆ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా ఆశించిన స్థాయిలో ఆ సీన్స్ షూటింగ్ రాలేదని మళ్లీ చిత్రీకరించాలని చిత్రబృందం నిర్ణయించుకుందట. ఈ క్రమంలో ఈ కూల్చి వేసిన ఇంటిని మళ్ళీ కొత్తగా నిర్మించబోతున్నారట. ఇప్పుడు ఆ సన్నివేశాలను రీషూట్ చేసి ప్రేక్షకులకు బాగా నచ్చే విధంగా ఎలివేట్ చేయాలని యూనిట్ భావిస్తోంది. ఏదేమైనా ఒకటికి రెండు సార్లు చాలా జాగ్రత్తగా పరిశీలించి మరి ఈ చిత్ర బృందం ఈ సినిమా ను తెరక్కిస్తుండగా అది రేంజ్ లో హిట్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా తో పాటు పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలను ఒప్పుకున్నా విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత అవి రిలీజ్ కానున్నాయి.