నివేదా థామస్ గురించి ఈ భయంకరమైన నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
నివేదా థామస్ తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. ఇక ఈమె తల్లి ఒక గృహిణి. ఈమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు.. అతని పేరు నిఖిల్. మొదటిసారిగా మోడలింగ్ వైపు అడుగు వేస్తూ.. మలయాళం, తమిళ్, తెలుగు సినిమా అవకాశాలను దక్కించుకుంది. మొదటిసారిగా 2002వ సంవత్సరంలో మలయాళంలో "ఉత్తర" సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది నివేదా. అంతేకాకుండా సన్ నెట్వర్క్ లో ప్రసారమయ్యే కొన్ని సీరియల్స్ కూడా నటించింది.
అలా అంచెలంచెలుగా ఎదుగుతూ తన నటనతో అభిమానులను బాగా సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత జెంటిల్మెన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118 వంటి సినిమాలో నటించి యూత్ ను బాగా ఆకర్షించింది. నివేదా నటించిన ప్రతి సినిమా హిట్ టాక్ తోనే నడిచింది. ఇదే ఈమె కెరియర్ కు ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు.
అంతేకాదు ఆఫ్రికా లో ఉన్న అతి ఎత్తైన పర్వతం కిలిమంజారో కూడా అధిరోహించి రికార్డు సృష్టించింది. ఈ ఘనత కేవలం కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించారు. ఈ ఘనత సాధించిన నివేదా థామస్ పై బంధువులు , స్నేహితులు, సినీ తారలు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇకపోతే నివేద హీరోయిన్ కావాలనే తన కోరికను నెరవేర్చుకోవడం కోసం ఒక వైపు చదువును , మరొక వైపు తన కెరీర్ ను చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందుతోంది.