టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంకా టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళం సూపర్ హిట్ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియం' సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా ట్రెడిషనల్ బ్యూటీ నిత్యా మీనన్, ఆలాగే దగ్గుబాటి రానా సరసన ఐశ్వర్యా రాజేష్ జంటగా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు ఇంకా టీజర్లు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇక ఆలాగే తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ రానుంది. దీపావళి పండుగ సందర్భంగా గురువారం (నవంబర్4) సాయంత్రం 7.02 గంటలకు 'లాలా భీమ్లా' సాంగ్‌కు సంబంధించిన వీడియో ప్రోమోను విడుదల చేస్తున్నట్లు భీమ్లా నాయక్ చిత్ర బృందం ప్రకటించడం అనేది జరిగింది.
https://twitter.com/shreyasgroup/status/1455817396527112194?t=EVd0RuhHxtM2NWVmDeX7rA&s=19
ఇక దీపావళి పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకుందాం.ఈ సందర్భంగా 'ఈ దీపావళి పండుగని # TheSoundOfBheemla' తో సెలబ్రేట్ చేసుకుందాం అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పోస్టర్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది సినిమా యూనిట్. ఇక ఈ పోస్టర్లో పంచె ధరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుదుటిపైన తిలకం పెట్టుకుని, ముందు మందు బాటిల్ పెట్టుకుని కనిపించడం జరిగింది.ఇక ఈ పోస్టర్ అయితే పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఏడాది వకీల్ సాబ్ సినిమాతో దూసుకోచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో మంచి కంబ్యాక్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అని అందుకోవడం ఖాయం అంటున్నారు చిత్ర బృందం వారు. ఇక చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో..