నేచురల్ స్టార్
నాని హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఆయన హీరోగా చేసిన
శ్యామ్ సింగరాయ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
డిసెంబర్ 3వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఆయన గత చిత్రాలు ఫ్లాప్స్ కావడంతో ఈ
సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని ఆయన భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
సాయి పల్లవి మరియు కృతి శెట్టి
హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ
సినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతు ఉండగా పోస్టర్లు ఎంతో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి.
త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మిగతా అప్డేట్లు రానున్నాయి. ఇకపోతే ఈ
సినిమా తర్వాత
నాని రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలను చేయనున్నాడు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో అంటే సుందరానికి అనే సినిమాను చేస్తున్న
నాని దసరా అనే
మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను కూడా చేయబోతున్నాడు. అలా
నాని ఈ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వరుస మంచి
సినిమా లతో వస్తున్నా కూడా అవి వారిని ఏమాత్రం హిట్ అనిపించకపోవడం ఒక్కసారిగా
నాని అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది.
ఇక ఆయన చేస్తున్న
దసరా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై పోయాడు నాని. ప్రస్తుతం ఈ సినిమాకు
హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో ఉంది చిత్రబృందం. గతంలో
సమంత హీరోయిన్ గా నటిస్తుంది అని అందరూ ఆనుకోగా ఇప్పుడు
కీర్తి సురేష్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది అని వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా నానికి మంచి స్నేహితులే కాకుండా గతం లో నానికి హిట్లు ఇచ్చిన హీరోయిన్లు కావడం విశేషం. ఈ ఇద్దరి లో ఎవరిని ఎంచుకోవాలో అన్న సందిగ్ధంలో
నాని లో ఏర్పడింది.
కీర్తి సురేష్ తో
నాని నేను
లోకల్ అనే
సినిమా చేయగా అది సూపర్ హిట్ అయింది. అలాగే సమంతతో కలిసి ఆయన గతంలో కొన్ని సినిమాలు చేయదా అవి కూడా సూపర్‌హిట్ అయ్యాయి .ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో
నాని ఎవరిని
హీరోయిన్ గా తీసుకుంటాడో చూడాలి.