పెద్దన్న సినిమా..హిట్ కొట్టాలంటే అన్ని కోట్లు రాబట్టలా..!

Divya
రజనీకాంత్ నటించిన తాజా చిత్రం పెద్దన్న. ఈ సినిమాని తమిళ్ నుంచి తెలుగులోకి రీమిక్స్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ లో అలనాటి హీరోయిన్ మీనా, కుష్బూ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. అందుచేతనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలతో పాటు మరి కొన్ని సినిమాలు కూడా పోటీ పడనున్నాయి.
ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను, అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్, టీజర్ వంటి విడుదల కాకముందే.. పెద్దన్న అన్న సినిమా కి తెలుగు ఇండస్ట్రీలో బాగానే బిజినెస్ జరిగింది. ఇక తమిళ నుంచి డబ్బింగ్ చేయబడిన సినిమాలలో ఎక్కువ బిజినెస్ ఈ సినిమాకే జరగడం గమనార్హం. అయితే ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు ఇప్పుడు ఒకసారి చూద్దాం.
1). నైజాం-4 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-2.20 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-1.45 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-కోటి రూపాయలు.
5). వెస్ట్-82 లక్షలు.
6). కృష్ణ-98 లక్షలు.
7). గుంటూరు-1.10 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-65 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం బిజినెస్ విషయానికి వస్తే..12.20 కోట్ల రూపాయలు జరిగినట్లు తెలుస్తోంది.
పెద్దన్న సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..12.2 కోట్ల రూపాయలు జరగగా.. ఈ సినిమా సక్సెస్ కావాలంటే..12.5 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. అయితే రజనీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఇదేం పెద్ద సమస్య కాదు. కానీ నీ రజనీకాంత్ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగలడం తో.. ఇప్పుడు చాలా సమస్యగా మారుతోంది. అంతేకాకుండా ఆ రోజునే చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు కూడా విడుదలై పోటీగా వస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో పెద్దన్న సినిమా ఎంత వసూళ్ళు రాబడుతుంది వేచిచూడాలి.కీర్తి సురేష్, నయనతార వంటి హీరోయిన్లు కూడా నటించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: