హీరో విజయ్ సేతుపతిపై అగంతకుడు దాడి..!

NAGARJUNA NAKKA
హీరో విజయ్ సేతుపతికి ఊహించని ఘటన ఎదురైంది. బెంగళూరు ఎయిర్ పోర్టులో ఆయనకు షాక్ ఇచ్చే పరిస్థితి చోటు చేసుకుంది. ఊహించని పరిణామంతో అక్కడున్న వారిని భయబ్రాంతులకు గురిచేసింది. ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి నడుస్తూ వెళ్తన్నాడు. అంతలోనే గుర్తు తెలియని వ్యక్తి ఆయన పై దాడికి దిగాడు. వెనుకనుంచి వచ్చి ఒక్కసారిగా కాలితో తన్నాడు. దీంతో విజయ్ సేతుపతికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎందుకిలా జరిగిందో ఆయనకే తెలియలేదు. వెంటనే చుట్టుపక్కల వాళ్లు అలర్ట్ అయ్యారు. ఆ అగంతకుడిని బంధించేశారు. ఆ తర్వాత విజయ్ సేతుపతి ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది సహకారంతో క్షేమంగా వెళ్లారు.

అయితే ఈ దాడికి బలమైన కారణం ఉందని సమాచారం. ఈ దాడి ఘటన ఇప్పడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అంతా ఈ దాడిని పరిశీలనగా చూస్తున్నారు. ఎందుకు ఇలా జరిగి ఉంటుందో తెలియక తికమక పడుతున్నారు. మానసిక రోగి ఏమైనా ఇలా చేశారా అని కూడా అనుకుంటున్నారు. మరోవైపు కన్నడ ప్రజలు విజయ్ సేతుపతిపై కోపంగా ఉన్నట్టు సమాచారం. అందుకే ఆయనపై దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణం విషయంలో కోలీవుడ్ సరిగా స్పందించలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయనకు నివాళులర్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే టాక్ కూడా వినిపిస్తోంది. సూపర్ స్టార్ ను కడసారి చూసేందుకు కొందరు నటులు సరిగా ఆసక్తి చూపించలేదని కోలీవుడ్ ప్రజలు కోపంగా ఉన్నారట. ఇది కూడా ఒక కారణంగా ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.

పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా ఆగ్రవేశాలు వ్యక్తమయి ఉంటాయని కొందరు అనుకుంటున్నారు. అయితే సరిగ్గా కారణం మాత్రం ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఏది ఏమైనా ఇలా దాడికి దిగడం చాలా తప్పు అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.విజయ్ సేతుపతి ప్రస్తుతం దక్షిణాది చిత్రాల్లోనే కాదు.. హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.



 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: