మనుధర్మ శాస్త్రాన్ని టార్గెట్ చేస్తున్న వర్మ !
స్త్రీలు పై పురషుల ఆధిపత్యం ఉండటం తప్పు కాదు అంటూ అలనాటి స్త్రీలను జంతువులతో పోలుస్తూ ప్రవచించిన మనుధర్మ శాస్త్రం రోజుల నుండి మహిళల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోయింది అని చరిత్రకారులు అంటారు. ఇప్పుడు మళ్ళీ మనుధర్మ శాస్త్రం పై వర్మ మనసుపడి స్త్రీలకు మనుధర్మ శాస్త్రం అన్యాయం చేసింది అంటూ ఒక కొత్త వివాదంలోకి ఎంటర్ అయ్యాడు.
దీనితో వర్మకు హఠాత్ గా స్త్రీల పై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చింది అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. స్త్రీని ఒక విలాస వస్తువుగా చూసే వర్మ మనుధర్మ శాస్త్రం వల్ల స్త్రీలకు అన్యాయం జరిగింది అని అనడం జోక్ గా ఉంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణా రాజకీయాలలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్న కొండా సురేఖ దంపతుల పై ఒక బయోపిక్ తీయడానికి వర్మ చాల బిజీగా కాలం గడుపుతున్నాడు.
రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో సంచలనం కల్గించిన దిశ అత్యాచార సంఘటన పై సినిమాను తీసిన వర్మకు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవ్వడంతో ఆ మూవీకి ‘ఆశ ఎన్కౌంటర్’ అన్న పేరు పెట్టి ఆసినిమాను విడుదల చేయడానికి ఎదురు చూస్తున్నాడు. ‘ఆశ ఎన్కౌంటర్’ సినిమాలో ఒక అమ్మాయిని అత్యంత క్రూరంగా చంపడం బలహీన వర్గాలకు చెందిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపడం వంటివి మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించే చేసారని అర్థంకాని భాషలో వర్మ చేసిన కామెంట్స్ అతడి కన్ఫ్యూజన్ ను చాటుతున్నాయి..