స్టార్ హీరో ప్రవర్తనపై ఘాటు కామెంట్ చేసిన తాప్సీ..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ తాప్సీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమాతో వెండితెరకు పరిచయం అయింది, మొదటి సినిమా తోనే తన అంద చందాలతో, నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మంచి క్రేజ్ సినిమా ఆఫర్లను కొట్టేసింది. కాక పోతే ఆ సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపక పోవడంతో తాప్సీ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. బాలీవుడ్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ వరుస లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చింది. అయితే ఇలా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమా రంగంలో పురుషాధిక్యత గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.


 హీరోయిన్లకు పేరొచ్చే సినిమాల్లో నటించేందుకు హీరోలు ఇష్టపడరు అంటూ తన సినిమా విషయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తాప్సీ చెప్పుకొచ్చింది.  ఓ సినిమాలో నాది డబల్ రోల్ కాగా, ఓ స్టార్ హీరో ని ఆ సినిమా కోసం అడగగా ఆ హీరో ఒప్పుకోలేదు అని ఆ హీరో తనతో ఇంతకు ముందు ఒక సినిమాలో నటించిన కూడా ఈ సినిమాకు ఓకే చెప్పలేదు అని తాప్సీ తెలియజేసింది.  ఒకటి, రెండు  సినిమాలు చేసిన హీరో లు కూడా ఆ సినిమా లో చేయడానికి ఒప్పుకోలేదు అని సినిమా ఇండస్ట్రీ లో హీరోలు అలా ఫీల్ అవ్వడం చాలా బాధాకరం అని తాప్సి చెప్పుకొచ్చింది. హీరోయిన్ రోల్ కి ప్రియార్టీ ఎక్కువగా ఉందనే కారణం గానే ఆ హీరోలు ఆ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశారు అని తాప్సీ పేర్కొంది.  ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. కొన్ని రోజుల క్రితమే తాప్సి సొంతగా ఒక నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: