"లైగర్" నుండి మరో సస్పెన్స్ సర్ప్రైజ్ ?
నేడు దీపావళి సందర్భంగా మేకర్స్ టైసన్ కు సంబంధించి అదిరిపోయే పవర్ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ కాగా ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. మరో కొద్ది రోజుల్లో విజయ్ దేవరకొండకు సంబంధించిన ఫైట్ సీన్ ఒకటి రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అది బాక్సర్ గా రింగ్ లో చేసే ఫైటా లేక...బయట మన విలన్ లతో చేసే ఫైట అన్నది మరొక సస్పెన్స్ గా మారింది. విజయ్ దేవరకొండ ను పక్క యాక్షన్ ఫిల్మ్ లో వెండి తెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ కోసం తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇపుడు విజయ్ కు సంబందించిన ఫైట్ వీడియో వస్తుందన్న వార్తలు అందరినీ ఆనంద పరుస్తున్నాయి.