కథ మాత్రమే కాదు.. హీరోయిన్లు కూడా అక్కడి నుంచే..!
'భీమ్లానాయక్' స్టోరీలైన్ మాత్రమే కాదు, ఈ సినిమాలో హీరోయిన్లు కూడా మళయాళం భామలే. పవన్ కళ్యాణ్‌తో నిత్యా మీనన్ జోడీ కడితే, రానాతో సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇంతకుముందు హీరోయిన్లుగా తమిళ అమ్మాయిలు సాయి పల్లవి, ఐశ్వర్యా రాజేష్‌ని తీసుకోవాలనుకున్నారు. కానీ పెద్దగా ప్రాముఖ్యత లేదని పవన్‌కి నో చెప్పింది పల్లవి. ఇక సెకండ్ హీరోతో జోడీ కట్టడానికి ఐశ్వర్య ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో కేరళ నుంచి హీరోయిన్స్‌ని దింపారు మేకర్స్.
సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి జనవరి 12న విడుదల అవుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్స్‌తో 'భీమ్లానాయక్'కి క్రేజీ బజ్ వచ్చింది. మరి టీజర్స్‌తోనే భారీ హైప్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఇప్పటి వరకు భీమ్లా నాయక్ నుంచి వచ్చిన అప్ డేట్స్ చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన నేటివిటీకి తగ్గట్టుగా డైలాగ్ లు ఉండటం.. పవర్ ఫుల్ పంచ్ లు ఉండటం.. పవన్ కళ్యాణఅ పంచె కట్టు అదరహో అనిపిస్తోంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ అంచనాల్ని పవన్ కళ్యాణ్ అందుకుంటారో లేదో చూడాలి. మరి రానా పాత్ర ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో కలుగుతోంది.