రజనీకాంత్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు..!
రజనీకాంత్ బెంగుళూరులో చదువుకునే వయసులోనే.. తన తల్లి మరణించడం జరిగింది. దీంతో తన చిన్నతనం నుంచే కూలి పని చేయవలసి వచ్చేది. ఇక తన చదువును పూర్తి చేసుకున్న తర్వాత.. 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉద్యోగం కోసం అన్వేషించే వాడు.1966-1973 మధ్య రకరకాల ఉద్యోగాలు చేశాడు. చివరకు బస్సు కండక్టర్ గా ఉద్యోగం సంపాదించాడు.
ఈ ఉద్యోగమే శివాజీ కెరీర్ ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. రజనీకాంత్ తన చిన్నతనంలోనే చాలా కష్టాలు పడినప్పటికీ.. తనలో ఉండే కళాకారుని వదులుకోలేదు. తన చిన్నతనంలోనే నాటకాలు కూడా వేసేవారు. ఈయన వేసిన నాటకాలలో విభిన్నమైన పాత్రలో తనదైన శైలిలో వేసేవాడు. ఆ స్టైలే తన జీవితాన్ని మార్చిందని చెప్పుకోవచ్చు. ఇక బస్సు లో కూడా ఒక కండక్టర్ గా ఉన్నప్పుడు కేవలం పది నిమిషాల్లోనే అందరికీ టికెట్లు ఇచ్చేవారట.
రజినీకాంత్ స్నేహితుడు రాజ్ బహదూర్ సహాయంతో మద్రాస్ కు బయల్దేరాడు రజనీకాంత్. అలా శివాజీ రాజు గా మద్రాసులో నటన కోసం శిక్షణ తీసుకుంటుండగా.. ఎన్నో కష్టాలు పడ్డాడు రజిని. ఖాళీ కడుపుతోనే కళామతల్లిని గట్టిగా నమ్ముకున్నాడు రజినీకాంత్. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. కె.బాలచందర్ డైరెక్టర్ కంట పడ్డాడు రజిని. అప్పుడు ఆయన అపూర్వ రాగంగల్ అనే సినిమాని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రజినీని కూడా తీసుకున్నారు. అప్పటికే ఆ సినిమాలో శివాజీ రాజ్ అనే పేరుతో మరొక నటుడు ఉండడంతో శివాజీ పేరును రజినీకాంత్ గా మార్చాడు డైరెక్టర్ బాల చందర్. ఇక రాఘవేంద్రరావు స్వామిని దర్శించి గురువారం రోజున ఈయన పేరును రజినీకాంత్ గా మార్చుకున్నాడు.