నందమూరి నటసింహం
బాలకృష్ణ ప్రస్తుతం
టాలీవుడ్ మాస్
డైరెక్టర్ లలో ఒకరైన
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ
సినిమా షూటింగ్ ని పూర్తి చేసి సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమాలో ముద్దుగుమ్మలు ప్రగ్యా జైస్వాల్,
పూర్ణ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో నందమూరి నటసింహం
బాలకృష్ణ రైతుగా, అఘోరా గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు, ఇందుకు సంబంధించిన ప్రోమో లను ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను అమాం తం పెంచేశాయి అని చెప్పవచ్చు. ఇప్పటికే
బాలకృష్ణ,
బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహ,
లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర
బ్లాక్ బస్టర్ లు గా నిలవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న అఖండ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అని చెప్పవచ్చు.
ఇలా జనాలలో ఫుల్ అంచనాలు క్రియేట్ అయిన ఈ సినిమాను
డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అఖండ
సినిమా తర్వాత
బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక
సినిమా లో నటించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే,
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో
బాలకృష్ణ హీరోగా నటించబోయే సినిమాకు జై
బాలయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు కూడా అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజా గా ఈ
సినిమా బృందం
బాలకృష్ణ సరసన
శృతిహాసన్ ను
హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది.
బాలకృష్ణ ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో అదరగొట్టబోతున్నట్లు, అందుకు తగిన పవర్ఫుల్ కథను గోపీచంద్ మలినేని ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.