నందమూరి నటసింహం
బాలకృష్ణ ప్రస్తుతం
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ
సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమాను
డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్,
పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు, ఈ సినిమాలో నందమూరి నటసింహం
బాలకృష్ణ రైతుగా, అఘోరా గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే
బాలకృష్ణ,
బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా,
లెజెండ్ సినిమాలు
బ్లాక్ బస్టర్ లుగా నిలవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఇది హైడ్రిక్
సినిమా కావడంతో ఈ సినిమాపై జనాల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే ఈ
సినిమా తర్వాత క్రాక్ సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ లో
బాలకృష్ణ ఒక
సినిమా చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా జరిగిపోయింది. ఈ సినిమాలో
బాలకృష్ణ సరసన
శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ
సినిమా తర్వాత తెలుగులో
కామెడీ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న
అనిల్ రావిపూడి దర్శకత్వం లో
బాలకృష్ణ ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎఫ్ త్రీ
సినిమా పనుల్లో బిజీగా ఉన్న
అనిల్ రావిపూడి ఆ
సినిమా తర్వాత
బాలకృష్ణ తో
సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఇప్పటికే వరస సినిమాలను లైన్ లో పెట్టిన
బాలకృష్ణ తన 109వ సినిమాను కూడా సెట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలకృష్ణ తన 109వ సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర బృందం అఫీషియల్ ప్రకటన చేయాల్సిందే.