"సలార్" మూవీ విడుదలకు ముహూర్తం ?

VAMSI
బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ జోష్ పై ఉన్న హీరో ప్రభాస్ ఒకేసారి రెండు, మూడు చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K, స్పిరిట్ వంటి చిత్రాలను అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు వరుసగా రెడీ చేసుకుంటున్నాడు డార్లింగ్. ఈ సినిమాలన్నింటినీ ఎప్పుడు ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేసి తమ ముందుకు వస్తాడు రెబల్ అంటూ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సలార్ షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం ఎపుడు విడుదల చేస్తారు అన్న విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఓ క్లారిటీ ఇవ్వలేదు ప్రభాస్.

అయితే తాజాగా చిత్ర పురి నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఫ్యాన్స్ కు అదిరిపోయే వార్త వినపడుతోంది. సలార్ సినిమా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేందుకు టీమ్ మంచి ముహూర్తం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ చేయడం అంటే సామాన్యమైన విషయమా? అందుకే అన్ని రకాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకునేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే సలార్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఉండబోతోందని టాలీవుడ్ లో టాక్ మొదలైంది.


ఇప్పటికే 2022 వేసవికి అని ఒక డేట్ ఇచ్చారు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు.  మరి మన డార్లింగ్ ఆ లడ్డు లాంటి వార్తను ఎప్పుడూ వినిపిస్తారో చూడాలి. కాగా ఈ సినిమా నుండి విడుదలయిన లుక్ మరియు పోస్టర్స్ అందరినీ ఎంత గానో ఆకట్టుకుంటున్నాయి. కెజిఎఫ్ లాంటి సాలిడ్ హిట్ నుం అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా అంతకు మించి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కెజిఎఫ్ 2 కు ఇబ్బంది లేకుండా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: