ఊహల్లో మునిగిపోయిన రౌడీ హీరో..!
'అర్జున్ రెడ్డి, గీత గోవిందం' హిట్స్‌తో విజయ్ దేవరకొండ స్టార్ లీగ్‌కి దగ్గరయ్యాడు. అతి తక్కువ సమయంలోనే టాప్ రేసులో జాయిన్ అయ్యాడని ఇండస్ట్రీ జనాలు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సూపర్ హిట్స్ తర్వాత విజయ్‌కి వరుస షాకులు తగిలాయి. 'నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాపులతో మార్కెట్ కూడా పడిపోయింది.
'గీత గోవిందం' టైమ్‌లో విజయ్ దేవరకొండ మార్కెట్ 100 కోట్ల వరకు వెళ్లింది. కానీ లాస్ట్ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' అయితే 40 కోట్లని కూడా చేరలేకపోయింది. దీంతో విజయ్ హవా తగ్గిందనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు గనక ఒక బ్లాక్‌బస్టర్ పడకపోతే, విజయ్ మార్కెట్ మళ్లీ కోలుకోలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ కంపల్సరీగా హిట్ కొట్టాల్సిన స్టేజ్‌లో 'లైగర్'కి సైన్ చేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా తెరకెక్కుతోందీ సినిమా. ఇక ఈ బాక్సింగ్ డ్రామాలో మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు. ఈ బాక్సింగ్ లెజెండ్ ఎంట్రీతో 'లైగర్'పైనా అంచనాలు పెరిగాయి. మరి ఈ మూవీతో విజయ్ మళ్లీ స్టార్ లీగ్‌కి దగ్గరవుతాడా అనేది చూడాలి.
విజయ్ దేవరకొండ లైగర్ మూవీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో.. విజయ్ పై ఫ్యాన్స్ అన్నే ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొడుతుందని ఫిక్స్ అయిపోయారు. హండ్రెడ్ డేస్ పక్కా అని ముందే డిసైడ్ అయిపోయారు. చూస్తుంటే... రౌడీ హీరో లైగర్ సినిమా ద్వారా పంజా విసిరేలా కనిపిస్తున్నారు. చూద్దాం.. విజయ్ దేవరకొండ ఊహించినట్టు.. ఫ్యాన్స్ అనుకున్నట్టు జరుగుతుందో లేదో. విజయ్ కి మాత్రం ఆల్ ది బెస్ట్ చెబుదాం.