అనుష్క శెట్టి అందుకున్న అవార్డులు ఎన్నో తెలుసా..?
రెండు నంది అవార్డులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ , తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుల తో పాటు అత్యంత గౌరవ పురస్కారమైన తమిళనాడు కలైమామణి అవార్డును కూడా సొంతం చేసుకుంది. 2009 లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి సినిమాలో నటించిన అనుష్క నటనకు, ఏకంగా నంది అవార్డు గెలుపొందడమే కాదు ఉత్తమ నటిగా కూడా సినిమా అవార్డులను సొంతం చేసుకుంది.
ఇక ఆ తర్వాత 2010లో వచ్చిన వేదం సినిమాలో మొదటిసారి ఈమె వ్యాంప్ క్యారెక్టర్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో అనుష్క నటనకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఇక 2015 లో నటించిన రుద్రమదేవి సినిమా ద్వారా ఉత్తమ నటిగా సినిమా అవార్డును కైవసం చేసుకుంది. సంతోషం ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు విజయ్ అవార్డ్ లకు కూడా నామినేట్ చేయబడిన అక్కడ కూడా కొన్ని అవార్డులను సొంతం చేసుకుంది. బాహుబలి 2 సినిమా కు గాను తమిళ్ భాష నుంచి ఉత్తమ నటి క్యారెక్టర్ గా బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. డమరుకం సినిమాకు బెస్ట్ హీరోయిన్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది అనుష్క.