మొదటిసారి బోల్డ్ కంటెంట్ తో డైరెక్టర్ మారుతి సక్సెస్ అవుతాడా?

VAMSI
ప్రస్తుతం ఓటిటి వేదికలు మంచి జోరు పైన ఉన్నాయి. స్టార్ హీరోయిన్ లు సైతం ఈ డిజిటల్ వేదికపై కనిపించటానికి ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాజల్, సమంత, తమన్నా వంటి అగ్ర తారలు సైతం ఈ వేదికపై వెబ్ సిరీస్ లతో తమ హవా చాటారు. ఇపుడు ఇదే తరహాలో తెలుగమ్మాయి ఇషా రెబ్బా, పూర్ణ, పాయల్ రాజ్ పుత్ లు కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఇపుడు సరికొత్త వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వెబ్ సిరీస్ ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారుతి సారథ్యంలో రూపుదిద్దుకోనుంది.

ఈ వెబ్ సిరీస్ కు "3 రోజెస్" అనే టైటిల్ ను ఖరారు చేశారు. నవంబర్ 12న ఈ సిరీస్ ను ఆహా యాప్ లో ప్రీమియర్ గా స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి మారుతి పర్యవేక్షణలో మ్యాగీ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎలాంటి గుర్తింపు  తెచ్చుకోనుందో చూడాలి. పలు సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మారుతి ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తో కూడా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.  రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్  గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో మనల్ని అలరించేందుకు మన ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ సంబంధించి టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇందులో ఇషాన్, సంగీత్ శోభన్, ప్రిన్స్ , సత్యం రాజేష్ , గోపరాజు రమణ,హేమ, వైవా హర్ష వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా మారుతీ డైరెక్ట్ చేసిన మంచిరోజులొచ్చాయి మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లో ప్రదర్శితం అవుతోంది. ఇందులో సంతోష్ శోభన్ మరియు మెహరీన్ లు హీరో హీరోయిన్లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: