టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సృష్టించి.. మాటల మాంత్రికుడిగా మారిన త్రివిక్రమ్?

praveen
సాధారణంగా సినిమా పరిశ్రమలో ట్రెండ్ అనే పదం బాగా వైరల్ గా మారిపోతూ ఉంటుంది. కొంతమంది హీరోలు వచ్చి తమ సినిమాలతో ట్రెండ్ సృష్టిస్తారు అని చెబుతూ ఉంటారు. కేవలం హీరోలు మాత్రమే కాదు దర్శకులు కూడా సరికొత్త ట్రెండ్కు నాంది పలుకుతారు అని నిరూపించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పటివరకు సినిమా అంటే పేజీలకు పేజీలు డైలాగులు.. భారీ ఫైట్ లు మాత్రమే ఉండాలి అనుకునే వారు. ఇక స్టార్ హీరోల సినిమాలు అంటే ఇలాంటివి లేకపోతే సినిమా హిట్ అవడం కష్టం అనే భావన కూడా ఉండేది. సినిమా  పరిశ్రమ మొత్తం ఇలాగే సాగిపోయేది. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చిసినిమా హిట్ అవ్వాలంటే కావాల్సింది పేజీలు పేజీలు డైలాగులు.. భారీ ఫైట్ సీన్లు కాదు నాలుగు పంచ్ డైలాగులు.. రెండు ఆకట్టుకునే సన్నివేశాలు సరిపోతాయి అంటూ నిరూపించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.


 త్రివిక్రమ్  శ్రీనివాస్ కలం నుంచి జాలువారే ప్రతి డైలాగు కూడా తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తన సినిమాలలో మాటలతోనే తూటాలను పేలుస్తూ ఉంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో తన డైలాగ్ లతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులు కనిపించవు. చిన్నపాటి పంచ్ డైలాగులు మాత్రమే ఉంటాయి. ఆ డైలాగులు తెలుగు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తూ ఉంటుంది. ఇలా పవర్ ఫుల్ పంచ్ డైలాగ్లతో.. అదిరిపోయే యాస ప్రాసతో  ప్రేక్షకులందరికీ మాటల మాంత్రికుడు గా మారిపోయాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.


ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి స్టార్ హీరోతో సినిమా తెరకెక్కించిన సరే.. ఆ సినిమాలో స్టార్ హీరో కంటే ఇక ఆ సినిమాలోని డైలాగులు ప్రేక్షకులకు బాగా గుర్తు ఉంటాయి. అంతేకాదు ఈ దర్శకుడు సినిమాలోని డైలాగులు ఎన్నో ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకుల నోళ్లల్లో నానుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో తన మాటలతో కొత్త ట్రెండ్ ను సృష్టించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులు.. అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ మాటల మాంత్రికుడి కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: