మరోసారి రజినీకాంత్, శివ కాంబినేషన్ రిపీట్ కానుందట..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళ్ ఇండస్ట్రీ లో ఎంత మార్కెట్ వుందో దాదాపు అదే రేంజ్ మార్కెట్ తెలుగులో కూడా ఉంది అని చెప్పవచ్చు. అలాంటి ఈ స్టార్ హీరో గత కొద్ది కాలంగా వరుస పరాజయాలతో బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయాడు. వరస పరాజయాలతో డీలా పడిపోయిన రజనీకాంత్ ఈ సారి ఎలాగైనా అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవాలి అనే ఉద్దేశంతో ఈ దీపావళి సందర్భంగా పెద్దన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు. ఇలా భారీ తారాగణంతో దీపావళి సందర్భంగా నవంబర్ 4 వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీ నుండి పర్వాలేదు అనే రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ తెలుగులో మాత్రం ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు తెచ్చుకోలేక పోతుంది.


రొటీన్ కథ, కథనంతో ఈ సినిమా సాగింది అంటూ అనేక మంది ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు శివ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దర్శకుడు శివ, అజిత్ తో వరుస పెట్టి సినిమాలు తీసి బ్లాక్ బాస్టర్ విజయాలను తమిళ్ లో అందుకున్నాడు. అలాగే రజనీకాంత్ తో కూడా  మరో సినిమా చేయబోతున్నాడు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. రజనీకాంత్ తో పెద్దన్న సినిమా చేసే టైం లోనే ఒక కథ ను శివ, రజనీకాంత్ కు వినిపించాడు అని, ఆ కథతో మరో సినిమా ను శివ, రజినీకాంత్ తో తీయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా దర్శకుడు శివ, రజనీకాంత్ తో తీసిన మొదటి సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోకపోయినా మరో అదిరిపోయే ఆఫర్ ను కొట్టేసాడు అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: